IPL 2019 Final | MI vs CSK | వాట్సన్, పాండ్యా ఇద్దరిలో ఎవరు రాణించిన కప్ ఆ టీమ్‌కే సొంతం...

తమదైన రోజున వీరిద్దరిలో ఎవరు చెలరేగినా మ్యాచ్ ఆ టీమ్ సొంతమవడం ఖాయం. వరుస సీజన్లలో రాణిస్తున్న వాట్సన్, పాండ్యా ఇద్దరు ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు. అటు బ్యాట్ తోనూ, బౌలింగ్‌తో చెలరేగడం ఇద్దరి ప్రత్యేకత.

news18-telugu
Updated: May 12, 2019, 5:04 PM IST
IPL 2019 Final | MI vs CSK | వాట్సన్, పాండ్యా ఇద్దరిలో ఎవరు రాణించిన కప్ ఆ టీమ్‌కే సొంతం...
వాట్సన్, పాండ్యా (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: May 12, 2019, 5:04 PM IST
షేన్ వాట్సన్, హార్దిక్ పాండ్య ఇద్దరిలో ఎవరు రాణించినా కప్పు ఆ జట్టు సొంతమవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే తమదైన రోజున వీరిద్దరిలో ఎవరు చెలరేగినా మ్యాచ్ ఆ టీమ్ సొంతమవడం ఖాయం. తమదైన రోజున వీరిద్దరిలో ఎవరు చెలరేగినా మ్యాచ్ ఆ టీమ్ సొంతమవడం ఖాయం. వరుస సీజన్లలో రాణిస్తున్న వాట్సన్, పాండ్యా ఇద్దరు ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అటు బ్యాట్ తోనూ, బౌలింగ్‌తో చెలరేగడం ఇద్దరి ప్రత్యేకత. వాట్సన్ సీనియర్ ప్లేయర్ గా ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకోగా, అదే సమయంలో పాండ్యా మైదానంలో మాయాజాలం చేయడం అతనికే సొంతం. అటు వాట్సన్ విషయానికి వస్తే ఓపెనర్ గా సీఎస్ కే తరపున దిగితే మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఉన్న ఆటగాడు. ముఖ్యంగా 2018 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 178 పరుగుల భారీ టార్గెట్ ను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఓపెనర్ గా దిగిన షేన్ వాట్సన్ ఊచకోత కోసినట్లు బ్యాటింగ్ చేసి ఫలితాన్ని తారుమారు చేశాడు. కేవలం 57 బంతుల్లో 117 పరుగులు చేసిన ఏకంగా 8 సిక్సర్లతో మోత మోగించిన వాట్సన్ నాటౌట్ గా ఉంటూనే మ్యాచ్‌ను విజయవంతంగా ముగించేశాడు. ఈ సీజన్ లో సైతం వాట్సన్ మొత్తం 318 పరుగులు చేసి 125.69 స్ట్రైక్ రేట్ తో స్థిరంగానే రాణించాడు.

ఇక అటు ముంబై ఇండియన్స్ నుంచి బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యా సైతం అటు బ్యాటింగ్ తోనూ, బౌలింగ్ తోనూ రాణించే సత్తా ఉన్న ఆల్ రౌండర్. ఈ సీజన్ లో మొత్తం 386 పరుగులు సాధించిన హార్దిక్ పాండ్యా జట్టులో ఏ స్థానం నుంచి బ్యాటింగ్‌కు దిగిన అద్భుతంగా రాణించే సత్తా ఉన్న ఆటగాడు. బిగ్ హిట్టర్ గా పేరున్న పాండ్యా, టీ 20 ఫార్మాట్ లో అత్యంత విలువైన ఆటగాడిగా పేరుంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పరుగులు పిండేందుకు హార్దిక్ పాండ్యా బ్యాట్ మరింత వేగంగా పనిచేస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఐపీఎల్ నాలుగో ట్రోఫీ గెలుచుకునేందుకు తహతహలాడుతున్న ముంబై ఇండియన్స్ గెలుపు హార్దిక్ పాండ్యా చివరి ఓవర్లలో రాణించడం పైనే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...