కుటుంబం కోసం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ క్రికెటర్

కుటుంబంతో కలిసి గడిపేందుకు సమయం ఉండటం లేదని, అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఈ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.

news18-telugu
Updated: April 26, 2019, 2:14 PM IST
కుటుంబం కోసం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ క్రికెటర్
షేన్ వాట్సన్
  • Share this:
ఒంటి చేత్తో ఎన్నో మ్యాచ్‌లను గెలిపించిన క్రికెటర్.. బ్యాటుతో, బంతితో రాణిస్తూ తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఆల్‌రౌండర్.. షేన్ వాట్సన్. ఐపీఎల్ 2017 సీజన్ వరకూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఆడి.. 2018 సీజన్‌లో సూపర్ కింగ్స్ లోకి అడుగుపెట్టిన వాట్సన్ ఇప్పుడు చెన్నై తరఫున పరుగుల వరద పారిస్తుతున్న ఈ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. గతంలోనే ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ఇచ్చిన అతడు, ప్రస్తుతం దేశీవాలీ లీగ్‌లలో సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ నిర్వహిస్తోన్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లోనూ కొనసాగుతున్నాడు.

అయితే, లీగ్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న వాట్సన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బిగ్ బాష్ లీగ్ ఐదో సీజన్‌కు తాను హాజరుకాలేనంటూ రాజీనామాను ప్రకటించాడు. దీనిపై వచ్చే సీజన్‌లోపు లీగ్ యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది. బిగ్ బాష్ లీగ్‌లలో ఆడకున్నా ప్రపంచ వ్యాప్తంగా జరిగే దేశీవాలీ లీగ్‌లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.

ఈ కీలక నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ఆయన్ను అడగ్గా.. కుటుంబంతో కలిసి గడిపేందుకు సమయం ఉండటం లేదని, అందుకే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఈ ఆల్‌రౌండర్ చెప్పుకొచ్చాడు.

First published: April 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...