news18-telugu
Updated: December 2, 2020, 6:07 PM IST
shane warne
ఆసీస్ స్పిన్ దిగ్గజం.. మాజీ బౌలర్ షేన్ వార్న్ క్రికెట్ ఆస్ట్రేలియాపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కాన్బెర్రా వేదికగా నేడు జరుగుతున్న మూడో వన్డేకు కమిన్స్‌ను పక్కనపెట్టడంపై తప్పుబట్టాడు. వాస్తవానికి ఐపీఎల్ 13 వ సీజన్ తర్వాత ఆసీస్ ఆటగాళ్లు నేరుగా టీమిండియాతో వన్డే సిరీస్ ఆడాల్సి వచ్చింది. మూడో వన్డే ప్రారంభానికి ముందే సిరీస్ కైవసం చేసుకోవడంతో రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆసీస్ ప్రధాన బౌలర్‌గా ఉన్న కమిన్స్‌కు మూడో వన్డే నుంచి విశ్రాంతి కల్పించారు. సుదీర్ఘమైన ఐపీఎల్ ఆడడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
అయితే వార్న్ ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ కామెంట్స్ చేశాడు. 'పాట్ కమిన్స్‌కు విశ్రాంతినివ్వడంపై నేను నిరాశకు లోనయ్యా. ఐపీఎల్ ఆడినంత మాత్రానా ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తారా? ఇలా అయితే ఆటగాళ్లను ఐపీఎల్‌కు పంపించాల్సింది కాదు.. ఏ లీగ్ ఆడినా ఆటగాళ్లకు దేశం తరపున ఆడడమే మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. అలసిపోయారనే భావనతో కమిన్స్ లాంటి ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సరికాదు. ఐపీఎల్ అనేది ఒక లీగ్.. ఏడాదికి ఇలాంటి లీగ్‌లు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఆడుతున్నది అంతర్జాతీయ వన్డే మ్యాచ్. మూడో వన్డేలో కమిన్స్ ఆడిస్తే బాగుండేది. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం నాకు నచ్చలేదు' అని ఈ లెగ్ స్పిన్ మాంత్రికుడు చెప్పుకొచ్చాడు.

pat- cummins
ఆసీస్ స్టార్ బౌలర్‌గా పేరు పొందిన కమిన్స్ ఐపీఎల్ 13వ సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. రూ.16 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యానికి నిరాశనే మిగిల్చాడు. 14 మ్యాచ్‌లాడిన కమిన్స్ 7.86 ఎకానమి రేటుతో 12 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే, ఫైనల్ వన్డేలో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 2-1 తో సిరీస్ కైవసం చేసుకుంది ఫించ్ సేన.
Published by:
Sridhar Reddy
First published:
December 2, 2020, 6:07 PM IST