హోమ్ /వార్తలు /sports /

Shane warne: సచిన్ తన బ్యాట్ తోనే కాదు వంటతోనూ వార్న్ ను భయపెట్టేశాడండోయ్..

Shane warne: సచిన్ తన బ్యాట్ తోనే కాదు వంటతోనూ వార్న్ ను భయపెట్టేశాడండోయ్..

Shane warne: దివంగత బౌలింగ్ లెజెండ్ షేన్ వార్న్ గురించి ఓ ఆసక్తిర విషయాన్ని మరో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ షేర్ చేసుకున్నాడు. 1998లో భారత పర్యటను ఆస్ట్రేలియా రాగా... వార్న్ ను సచిన్ తన ఇంటికి డిన్నర్ కు ఆహ్వానించాడు.

    Shane warne : ఆస్ట్రేలియా (Australia)కు చెందిన షేన్ వార్న్ (Shane Warne) దిగ్గజం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ స్పిన్ లెజెండ్ తన టెస్టు కెరీర్ లో 145 మ్యాచ్ లు ఆడి 708 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శనను ఏకంగా 37 సార్లు ప్రదర్శించాడు. టెస్టుల్లో వార్న్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 71 పరుగులకు 8 వికెట్లు. ప్రతి 25 పరుగులకు ఓ వికెట్ తీశాడు.  ఇంతటి  సూపర్ బౌలర్ ను సైతం సచిన్ టెండూల్కర్ (Sachin tendulkar) భయపడేలా చేశాడు. ఇతర బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన వార్న్... సచిన్ ముందు మాత్రం తల వంచాడు. అయితే వార్న్ గత శుక్రవారం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. థాయ్ లాండ్ (Thai land)లోని అతడి విల్లాలో గుండెపోటు (Heart Attack)తో మరణించాడు.

    తాజాగా వార్న్, సచిన్ ల గురించి ఓ ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.  ఈ విషయాన్ని సచిన్ స్వయంగా తెలిపాడు. 1998లో ఆస్ట్రేలియా క్రికెట్ టీం భారత పర్యటనకు వచ్చింది. ఆ సందర్భంగా సచిన్ వార్న్ ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. వార్న్ కోసం తాను చికెన్ డిష్ ను వండినట్లు సచిన్ పేర్కొన్నాడు.

    సచిన్ ఇంకా ఏమన్నాడంటే ’ నేను వడ్డించిన చికెన్ కర్రీలో నుంచి  ఓ ముక్కను వార్న్ తీసుకొని తిన్నాడు. అంతే.. ఇంకో ముక్కను నోట్లో పెట్టుకోవడానికి అతడు భయపడుతున్నాడు. నేను ఇతర అతిథులకు వడ్డిస్తూ ఉన్నా. అయితే వార్న్ మాత్రం నా మేనేజర్ కు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపించింది. ఇంతలో మేనేజర్ నా వైపు చూసి వార్న్ చికెన్ డిష్ ను తినడం లేదని బదులిచ్చాడు. ఏంటని కారణం వెతికితే చికెన్ స్పైసీ గా ఉన్నట్లు తెలిసింది‘ అని సచిన్ అప్పటి సంఘటను గుర్తు చేసుకున్నాడు.  వార్న్ జీవితానికి సంబంధించిన ఓ డాక్యుమెంటరీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవుతుంది. అందులోనే ఈ సంఘటన గురించి సచిన్ పేర్కొన్నాడు. అలాగే వార్న్ కూడా ఈ విషయం గురించి తన మనసులోని మాటను బయటపెట్టాడు. సచిన్ ఆతిథ్యం అద్భుతంగా ఉందన్నాడు. సచిన్ డిన్నర్ కు ఆహ్వానించగానే కాదనలేకపోయానన్నాడు. అయితే చికెన్ డిష్ లోని ఒక పీస్ ను నోట్లో వేసుకోగానే... నా మైండ్ పేలిపోయిందన్నాడు. ఆ డిష్ చాలా కారంగా ఉందంటూ వీడియోలో పేర్కొన్నాడు. అయితే సచిన్, అతడి ఫ్యామిలీ  ఆ రోజు తనను బాగా చూసుకున్నారంటూ వార్న్ తెలిపాడు.

    First published:

    ఉత్తమ కథలు