సరికొత్త రికార్డు నెలకొల్పిన విండీస్ ఓపెనర్ షాయ్ హోప్

వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో బ్యాట్స్‌మెన్‌గా హోప్ రికార్డుల్లోకి ఎక్కాడు.

news18-telugu
Updated: December 22, 2019, 4:44 PM IST
సరికొత్త రికార్డు నెలకొల్పిన విండీస్ ఓపెనర్ షాయ్ హోప్
వెస్టిండీస్ ఓపెనర్ షాయ్ హోప్ (Image : ANI)
  • Share this:
వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరిన రెండో బ్యాట్స్‌మెన్‌గా హోప్ రికార్డుల్లోకి ఎక్కాడు. కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హోప్ 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. హోప్‌కు ఇది 67వ ఇన్నింగ్స్.సౌతాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా 57 ఇన్నింగ్స్‌ల్లోనే 3వేల పరుగుల మైలురాయితో టాప్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అజామ్ 68 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

కాగా, భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో షాయ్ హోప్ 42 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ 21 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్‌లో రోస్టన్ చేస్ 38 పరుగులు,శిమ్రోన్ 37, పరుగులు చేశారు. ప్రస్తుతం నికోలస్ పూరన్(44),కీరన్ పొలార్డ్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు. 41.2ఓవర్లలో 205/4 పరుగులు సాధించిన విండీస్.. భారీ స్కోర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.


First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు