విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పిన ఐసీసీ.. అఫ్రిది రియాక్షన్ ఇదే

కొహ్లీ గొప్ప ఆటగాడని.. అతడి సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. క్రికెట్ అభిమానులకు ఇలాగే వినోదం అందించాలని ట్విటర్‌లో పేర్కొన్నాడు అఫ్రిది.

news18-telugu
Updated: September 19, 2019, 4:00 PM IST
విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పిన ఐసీసీ.. అఫ్రిది రియాక్షన్ ఇదే
అఫ్రిది, కొహ్లీ
  • Share this:
టీమిండియా కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ మరో రికార్డు సాధించాడు. ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మట్లలో 50కి పైగా యావరేజ్ సాధించి చరిత్ర సృష్టించాడు విరాట్. బుధవారం మొహాలీలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కొహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కొహ్లీ రికార్డ్‌ని ఐసీసీ ట్వీట్ చేయడంతో ప్రముఖ క్రికెటర్లు స్పందించి.. కొహ్లీని ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఇక పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సైతం ఐసీపీ ట్వీట్‌పై స్పందిస్తూ కొహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. కొహ్లీ గొప్ప ఆటగాడని.. అతడి సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించాడు. క్రికెట్ అభిమానులకు ఇలాగే వినోదం అందించాలని ట్విటర్‌లో పేర్కొన్నాడు. గతంలో ఆన్ ఫీల్డ్‌లో కొహ్లీ, అఫ్రిది పలుమార్లు గొడవపడ్డారు. అలాంటి అఫ్రిది ఇప్పుడు కొహ్లీని పొగడడం హాట్‌టాపిక్‌గా మారింది.విరాట్ కొహ్లీ బ్యాటింగ్ యావరేజ్ వివరాలు:
టెస్ట్‌లు- 53.14
వన్డే- 60.31
టీ20- 50.58కాగా, మొహాలీలో జరిగిన ట్వీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కొహ్లీ 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేవలం 52 బంతుల్లోనే 72 పరుగులు(3 సిక్స్‌లు, 4 ఫోర్లు) చేశాడు.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading