పుత్రికోత్సాహం..ఐదోసారి తండ్రి అయిన షాహిద్ అఫ్రిది

పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఐదో బిడ్డకు తండ్రి అయ్యారు. ఇప్పటికే అఫ్రిదికి నలుగురు కూతుళ్లు ఉండగా...ఇప్పుడు మరో ఆడబిడ్డ పుట్టింది.

news18-telugu
Updated: February 15, 2020, 9:36 AM IST
పుత్రికోత్సాహం..ఐదోసారి తండ్రి అయిన షాహిద్ అఫ్రిది
తన ఐదుగురు కూతుళ్లతో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Twitter/Afridi)
  • Share this:
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఐదో బిడ్డకు తండ్రి అయ్యారు. ఇప్పటికే అఫ్రిదికి నలుగురు కూతుళ్లు ఉండగా...ఇప్పుడు మరో ఆడబిడ్డ పుట్టింది. ఐదుగురు అమ్మాయిలతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అఫ్రిది. ‘భగవంతుడు నాపై మరోసారి కృపాకటాక్షాలు చూపారు..ఇప్పటికే నలుగురు అద్భుతమైన కూతుళ్లు ఉండగా...ఇప్పుడు ఐదో కూతుర్ని ప్రసాదించాడు’ అంటూ ట్వీట్ చేశారు. తీపి కబురును శ్రేయోభిలాషులతో పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐదో బిడ్డకు తండ్రి అయిన అఫ్రిదికి పలువురు ఫ్యాన్స్ విషెస్ చెప్పారు.First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు