SHAH RUKH KHAN ASKS FUNNY QUESTION WILL KOLKATA KNIGHT RIDERS WIN IPL 2021 TROPHY HE GIVES HILARIOUS REPLY SA
ఆ కప్పులో కాఫీ తాగుతా.. షారుక్ ఖాన్‌కు ఎంత పెద్ద ఆశ.. ఇంతకీ అది నెరవేరుతుందా!
shahrukh khan
కోల్‌కతా నైట్‌రైడర్స్ (KOLKATA KNIGHT RIDERS) కూడా ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలనే కసితో ఉంది. ముఖ్యంగా ఆ జట్టు సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(SHAHRUKH KHAN) తమ అత్యుతమ ప్రదర్శన ఇవ్వాలని ఆశతో ఉన్నారు.
ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) ప్రారంభం కానున్న అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. విజేత నిలవాలనే వ్యూహాలతో ముందుకు కదులుతున్నాయి. అదే విధంగా టైటిల్ ఫెవరెట్ జట్లలో ఒకటైనా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KOLKATA KNIGHT RIDERS) కూడా ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలనే కసితో ఉంది. ముఖ్యంగా ఆ జట్టు సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(SHAHRUKH KHAN) తమ అత్యుతమ ప్రదర్శన ఇవ్వాలని ఆశతో ఉన్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేకేఆర్ అభిమానుల కోసం '#AskSRK' క్యాంపెయిన్ మెుదలుపెట్టారు. దీనిలో భాగంగా పలువురు ఫ్యాన్స్ షారుఖ్‌ను పలు ప్రశ్నలు అడిగారు. "భాయ్ ఈ సారైనా మన టీం కప్పు గెలుస్తుదా’’ అని ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు షారుక్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
ఇంతకి షారుఖ్ ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలుసా. కేకేఆర్ కప్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ కేకేఆర్ టైటిల్ గెలిస్తే ఆ కప్పులో కాఫీ తాగుతాను' అంటూ సరాదగా రిప్లై ఇచ్చారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాద్ షా కొరికను చూసి అభిమానులు ఫన్నీగా ఫీలవుతున్నారు.
ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జర్నీ అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. మెుదట్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన జట్టు గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. ఒడుదొడుకులతో సాగుతుంది. తొలి మూడు సీజన్లలో లీగ్ దశలోనే ఆగిపోయిన కేకేఆర్.. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా భాధ్యతలు చేపట్టిన తర్వాత 2012, 2014 జట్టు విజేతగా నిలిచింది. గౌతమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్ళిపోయిన తర్వాత కోల్‌కతా కనీసం ప్లేఆఫ్ కూడా చేరుకోలేకపోయింది.
గత రెండు సీజన్లలో కేకేఆర్ ప్రదర్శన మరీ పేలవంగా ఉంది. ఐపీఎల్ 2020 మధ్యలోనే దినేశ్ కార్తీక్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి ఇయాన్ మోర్గాన్‌కు కట్టబెట్టాడు. ఆ సిజన్లో కూడా ఆ జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2020లో కేకేఆర్ అయిదో స్థానంలో నిలిచింది. ఇక ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మెుదటి మ్యాచ్ ఆడనుంది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.