సచిన్ 30 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల అమ్మాయి..

అతి చిన్నవయసులో హాఫ్ సెంచరీ చేసిిన సచిన్ రికార్డును షఫాలీ వర్మ బ్రేక్ చేసింది.

news18-telugu
Updated: November 10, 2019, 7:28 PM IST
సచిన్ 30 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 15 ఏళ్ల అమ్మాయి..
షఫాలీ వర్మ (Image:BCCI Women/Twitter)
  • Share this:
సచిన్ టెండుల్కర్ అంటే రికార్డుల రారాజు. ఎవరు ఎన్ని రకాల రికార్డ్స్ క్రియేట్ చేసినా.. సచిన్ పేరిట ఏదో ఒక రికార్డు అలాగే ఉంటుంది. అలాంటి క్రికెట్ గాడ్‌ సచిన్ టెండుల్కర్ 30 ఏళ్ల రికార్డును ఓ చిచ్చరపిడుగు బద్దలు కొట్టింది. ఔను. సచిన్ రికార్డు బ్రేక్ చేసింది ఓ అమ్మాయి. మహిళల క్రికెట్ భారత ఓపెనర్ షఫాలి వర్మ సచిన్ రికార్డును చెరిపేసింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మ 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. ఓవరాల్‌గా జట్టు స్కోర్ 185/4కు చేరింది.

సచిన్ టెండుల్కర్ తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసినప్పుడు అతడి వయసు 16 సంవత్సరాలు 214 రోజులు. 1989లో పాకిస్తాన్‌తో ఆడిన తన ఫస్ట్ టెస్ట్‌లో సచిన్ ఆ రికార్డును సృష్టించాడు. ఇప్పుడు షఫాలీ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆమె వయసు 15 సంవత్సరాల 285 రోజులు. అంతర్జాతీయ టీ20లో రోహిత్ శర్మ తక్కువ వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. అంతకంటే తక్కువ వయసులోనే షఫాలీ వర్మ హాఫ్ సెంచరీ కొట్టి రోహిత్ రికార్డును కూడా బ్రేక్ చేసింది.

గతంలో యూఏఈకి చెందిన కె ఎగోడేజ్ 15 సంవత్సరాల 267 రోజుల వయసులో టీ20లో హాఫ్ సెంచరీ చేసింది. 73 రన్స్ చేసిన షఫాలి వర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన రెండో అతి చిన్న వయసు క్రీడాకారిణిగా రికార్డును క్రియేట్ చేసింది.
First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు