సచిన్ రిటైర్‌మెంట్‌కు ఏడేళ్ళు.. ఆ రోజు విరాట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా!

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సోమవారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఇనేళ్ళే అవుతున్నా అతనిపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. 2013, నవంబర్‌ 16న వెస్టిండీస్‌తో చివరి టెస్ట్‌తో తన క్రికెట్ ప్రస్ధానానికి తెర దించాడు.

news18-telugu
Updated: November 16, 2020, 6:26 PM IST
సచిన్ రిటైర్‌మెంట్‌కు ఏడేళ్ళు.. ఆ రోజు విరాట్ ఇచ్చిన  గిఫ్ట్ ఏంటో తెలుసా!
విరాట్ కొహ్లీ, సచిన్ టెండుల్కర్ ( BCCI/ twitter )
  • Share this:
స‌చిన్ టెండూల్కర్.. ఆ పేరు లక్షలాది మందికి ఇన్స్‌ప్రేషన్. ఆ క్రికెట్ లేజెండరీ బ్యాట్‌తో చేసిన మాయా అభిమానుల గుండెల్లో ఇప్పటికి నిలిచిపోతుంది. అతని 22 ఏళ్ల సుదీర్ఘ కిక్రెట్ ప్రయాణంలో ఎన్నో మైలురాయిలు మరెన్నో ఆటుపోట్లు వాటిని తట్టుకొని అతను చేసిన సహాసం అతన్ని క్రికెట్ దేవున్ని చేసింది. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ అడుగు పెట్టిన సచిన్‌కు తొలినాళ్ళలలోనే అమోగమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. 100 సెంచరీల సాధించి అందనంత ఎత్తుకు చేరాడు. భారత అత్యున్నత పురస్కారమైన 'భారత రత్న'ను గెలిచాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సోమవారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఇనేళ్ళే అవుతున్నా అతనిపై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు. 2013, నవంబర్‌ 16న వెస్టిండీస్‌తో చివరి టెస్ట్‌తో తన క్రికెట్ ప్రస్ధానానికి తెర దించాడు. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భావోద్వేగంతో తను ఇచ్చిన సందేశం వల్ల అందరి కళ్ళు చెమర్చాయి. నేటికి ఆ సన్నివేశాన్ని అభిమానులు గుర్తిచేసుకుంటున్నారు. ఆ రోజు సచిన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ విరాట్  అత్యంత విలువైన దాన్ని బహుమతిగా ఇచ్చాడు. కోహ్లీకి తన తండ్రి ఇచ్చిన పవిత్ర దారాన్ని ఆరాధ్య క్రికెటర్‌కు ఇచ్చేశాడు. కోహ్లీ చాలా రోజులు తన దగ్గరే  ఆ దారాన్ని  దాచుకున్నాడు. విరాట్ ఎక్కడికి వెళ్లినా అది వెంటే ఉంచుకునేవాడు. అంతటి అత్యంత విలువైన దాన్ని సచిన్‌పై ఉన్న గౌరవంతో ఆయనకు ఇచ్చేశాడు.
సచిన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ  వీడ్కొల్ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ట్విటర్‌లో పోస్ట్‌లు చేస్తున్నారు. అలాగే రాజస్థాన్ రాయల్స్, ఐసీసీ,సన్‌రైజర్స్ హైదరాబాద్,ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీ కూడా సచిన్ రిటైర్‌మెంట్ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టాయి.
Published by: Rekulapally Saichand
First published: November 16, 2020, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading