షాకింగ్ న్యూస్.. క్రికెట్ బోర్డులో ఏడుగురికి కరోనా పాజిటివ్..

క్రికెటర్లు, వారితో ఉండాల్సిన కొంతమంది సిబ్బంది, కాంట్రాక్ట్ ప్రొఫెషనల్ ఆటగాళ్లు మొత్తం వంద మంది వరకు ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది.

news18-telugu
Updated: June 22, 2020, 10:33 PM IST
షాకింగ్ న్యూస్.. క్రికెట్ బోర్డులో ఏడుగురికి కరోనా పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్‌డౌన్ కారణంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ప్రధానంగా లాక్‌డౌన్ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లు రద్దు కావడం వల్ల అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇండియాలో ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ టోర్నీ జరగకపోవడంతో క్రికెట్ లోకానికి తీరని నిరాశే మిగిలింది. ఏలాగైనా ఎప్పటిలాగే ఐపీఎల్ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ చూసింది. ఈ టోర్నీలో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల క్రికెటర్లు ఆడుతుంటారు. దీంతో చాలా దేశాలు ఐపీఎల్ టోర్నీని చూసేందుకు విపరీతమైన ఆసక్తితో ఉంటారు. కరోనా వైరస్ పుణ్యమా అంటూ క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా రద్దయ్యాయి.

అయితే ఇటీవల లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ బోర్డు మళ్లీ క్రికెటర్లకు శిక్షణను ప్రారంభించాలని భావించింది. అందులో భాగంగానే క్రికెటర్లు, వారితో ఉండాల్సిన కొంతమంది సిబ్బంది, కాంట్రాక్ట్ ప్రొఫెషనల్ ఆటగాళ్లు మొత్తం వంద మంది వరకు ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈఓ జాక్వెస్ ఫాల్ తెలిపారు.

దీనిపై జాక్వెస్ స్పందిస్తూ.. మేం వంద మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, అందులో ఏడుగురికి మాత్రమే పాజిటివ్ రావడం చాలా తక్కువని చెప్పుకొచ్చారు. ఫలితంగా దక్షిణాఫ్రికా బోర్డు జూన్ 27న లోకల్‌గా ప్రారంభించాలనుకున్న టోర్నమెంట్‌ను సైతం నిరవధికంగా వాయిదా వేసింది.
First published: June 22, 2020, 10:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading