గ్రాండ్‌స్లామ్ క్వీన్ సెరెనా విలియమ్స్ ‘సెక్సిజం’ ఆరోపణలు ప్రస్తుతం టెన్నిస్ వరల్డ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.కొంతమంది టెన్నిస్ దిగ్గజాలు,ప్రస్తుత టెన్నిస్ ప్లేయర్లు సెరెనాకు మద్దతు ప్రకటించగా...మహిళల టెన్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ మార్టినా నవ్రతిలోవా మాత్రం తప్పుబట్టారు.అమెరికన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఫీల్డ్ అంపైర్‌తో వ్యవహరించిన తీరు సబబు కాదని..సెరెనా స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించి ఉంటే ఇంత రాద్దాంతం జరిగి ఉండేది కాదన్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్‌లో మహిళలకు సమాన హక్కులు, పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ ఇవ్వాలంటూ మార్టినా నవ్రతిలోవా గత కొంతకాలంగా పోరాడుతూనే ఉన్నారు.ఫైనల్ మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై సెరెనా అసమ్మతి వెల్లగక్కడాన్ని నవ్రతిలోవా విమర్శించారు.సెరెనా విలియమ్స్ స్థానంలో మెన్స్ ప్లేయర్ ఎవరైనా ఉండి ఉంటే..అంపైర్ ఇదే నిర్ణయం తీసుకుంటారా..లేదా అనేది ఎప్పటికీ తేలని అంశమే అన్నారు.సెరెనా విలియమ్స్ వంటి ప్రపంచప్రఖ్యాత స్టార్ టెన్నిస్ ఆట గౌరవాన్ని మరింత పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు నవ్రతిలోవా.ఏ క్రీడలో అయినా ఎంతటి ప్లేయర్ అయినా తాము ఆడుతున్న ఆట ప్రతిష్టకు భంగం కలుగకుండా ప్రవర్తిస్తేనే మంచిదన్నారు. 18 సార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ చాంపియన్‌గా మహిళల టెన్నిస్‌లో ఆల్ టైమ్ గ్రేట్‌గా వెలుగొందిన మార్టినా నవ్రతిలోవానే స్పూర్తిగా తీసుకుని సెరెనా విలియమ్స్ ప్రస్తుతం టెన్నిస్ వరల్డ్‌ను ఏలుతేంది.
మరోవైపు మహిళా టెన్నిస్ దిగ్గజాలు బిల్లీ జీన్ కింగ్, క్రిస్ ఎవర్ట్..సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జొకోవిచ్ సెరెనాకు బాసటగా నిలిచారు.ఆన్‌ఫీల్డ్ అంపైర్‌దే తప్పు అని ఆమెకు మద్దతు ప్రకటించారు.యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపనీస్ రైజింగ్ స్టార్ నవోమీ ఒసాకాతో జరిగిన మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ లైన్ అంపైర్‌ను దూషించడంతో సెరెనా పెద్ద మూల్యమే చెల్లించింది.పెనాల్టీ విధించడంతో ఒక గేమ్ పాయింట్ ఒసాకాకు కోల్పోవడంతో పాటు మ్యాచ్ ఓడి సింగిల్స్ ట్రోఫీ చేజార్చుకుంది.
సెరీనా విలియమ్స్ ‘సెక్సిజం’ ఆరోపణల వెనక కారణమేమిటంటే... నయోమీ ఒసాకా చేతిలో 6-2 తేడాతో మొదటి సెట్ ఓడిన తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన సెరెనా తన కోచ్‌తో కోర్టు నుంచే సంప్రదింపులు చేయడం మొదలెట్టింది. ఫైనల్ మ్యాచ్‌కు లైన్ అంపైర్‌గా వ్యవహరిస్తున్న కార్లోస్ రామోస్ ఆమెను హెచ్చరించాడు. లైన్ అంపైర్ వార్నింగ్‌తో ఆగ్రహానికి లోనైన సెరెనా విలియమ్స్ అంపైర్ కార్లోస్‌ను ‘దొంగ’ అంటూ సంబోధిస్తూ తిట్టింది. లైన్ అంపైర్ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని కోరింది. నిబంధనలకు వ్యతిరేకంగా ఆన్ ఫీల్డ్ అంపైర్‌ను తిట్టినందుకు సెరెనాపై స్పాట్లోనే వేటుపడింది. తనను దూషించినందుకు పెనాల్టీగా నవోమీ ఒసాకాకు రామోస్ ఒక గేమ్ పాయింట్ ప్రకటించాడు. ఈ పాయింట్‌తో రెండో సెట్లో 5-3తో ఆధిక్యంలో నిలిచిన ఒసాకా ఆధిక్యంలో నిలిచి..విజయానికి మరింత చేరువైంది.ఆ తర్వాతి పాయింట్ గెలిచిన తర్వాత సెరీనా విలియమ్స్ కంటతడి పెడుతూ సూపర్వైజర్తో మాట్లాడడం కనిపించింది. ఆ తర్వాత సెట్ పాయింట్ సాధించిన నయోమీ, సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. తాను మహిళను కాబట్టే అంపైర్లను తనపై ఇలా కఠినంగా వ్యవహరిస్తున్నారని, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఇలాంటి నిబంధనలు ఎందుకు గుర్తుకురావంటూ సెరెనా నిలదీసింది. ‘సెక్సిజం’ కారణంగానే మహిళలను చిన్న చూపు చూస్తున్నారంటూ వాపోయింది. ఇంతకు ముందు 2009 యూఎస్ సెమీ ఫైనల్లో, 2011 ఫైనల్లో కూడా ఇలాగే లైన్ అంపైర్లతో గొడవ పడింది సెరీనా. అయితే ఆమె అంపైర్‌తో గొడవపడిన ప్రతీ మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూడడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Serena Williams, Tennis, US Open 2018