హోమ్ /వార్తలు /క్రీడలు /

యూఎస్ ఓపెన్: సెమీస్‌లో సెరెనా విలియమ్స్

యూఎస్ ఓపెన్: సెమీస్‌లో సెరెనా విలియమ్స్

అమెరికన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ జోరు ( Twitter Image)

అమెరికన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ జోరు ( Twitter Image)

మోడ్రన్ టెన్నిస్ క్వీన్ సెరెనా విలియమ్స్...7వ సారి అమెరికన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది.

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ అమెరికన్ ‌ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ షో కొనసాగుతోంది. ఉమెన్స్ సింగిల్స్‌లో అమెరికన్ టెన్నిస్ క్వీన్స్‌ సెరెనా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ఫైనల్‌లోనూ బ్లాక్ థండర్‌కు పోటీనే లేకుండా పోయింది. చెక్ రిపబ్లిక్ వండర్ కరోలినా ప్లిస్కోవాకు షాకిచ్చి సెమీస్‌ బెర్త్ ఖాయం చేసుకుంది.7వ సారి అమెరికన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ దక్కించుకోవాలని తహతహలాడుతోంది.17వ సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా 8వ సీడ్ కరోలినా లిస్కోవాకు చెక్ పెట్టింది. క్వార్టర్‌ఫైనల్‌లో వరుస సెట్లలో నెగ్గి టైటిల్ వేటలో నిలిచింది.

తొలి సెట్ నుంచే మాజీ చాంపియన్ జోరు కొనసాగింది.ఆట ఆరంభంలో పోటీ ఆసక్తికరంగా సాగినా సెరెనా ఎదురుదాడికి దిగడంతో ప్లిస్కోవా పోరాడలేకపోయింది.6-4తో తొలి సెట్ నెగ్గి సెరెనా మ్యాచ్‌‌పై పట్టు బిగించింది.తనదైన స్టైల్‌లోనే రెచ్చిపోయి ఆడి...ప్రత్యర్ధిపై ఒత్తిడి పెంచింది.సెరెనా దూకుడు ముందు పదే పదే పొరపాట్లు చేసి ప్లిస్కోవా తేలిపోయింది.6-3తో రెండో సెట్ సైతం నెగ్గి సెమీఫైనల్‌లో ఎంటరైంది.సెమీస్‌లో లాత్వియన్ సంచలనం అనస్టీసియా సెవాత్సోవాతో సెరెనా పోటీ పడనుంది.19వ సీడ్‌గా బరిలోకి దిగిన సెవాత్సోవా ఓ గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్ చేరడం ఇదే తొలి సారి.దీంతో సెమీస్‌లోనూ సెరెనా విజయం దాదాపుగా ఖాయమైనట్లే అని టెన్నిస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

6 సార్లు అమెరికన్ ఓపెన్ సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన సెరెనా విలియమ్స్ మరోసారి టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా దూసుకుపోతోంది.సెరెనా దూకుడుకు సెమీస్‌లో అయినా బ్రేక్ పడుతుందో లేదో చూడాలి. 1999లో తొలిసారిగా యూ ఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సెరెనా ఆ తర్వాత 2002,2008లోనూ చాంపియన్‌గా నిలిచింది. 2012 నుంచి 2014 వరకూ వరుసగా మూడు సార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అమెరికన్ ఓపెన్ టెన్నిస్ ఓపెన్ యుగంలో 6 సార్లు సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన ఘనత సెరెనా విలియమ్స్‌కే దక్కింది.

ఇవి కూడా చదవండి:


ఫెదరర్,షరపోవా ఔట్..కళ తప్పిన యూఎస్ ఓపెన్

VIDEO : పూనకం వచ్చినట్లు ఊగిపోయిన స్లొయాన్ స్టీఫెన్స్

First published:

Tags: Serena Williams, Tennis, US Open 2018

ఉత్తమ కథలు