హోమ్ /వార్తలు /క్రీడలు /

యూ ఎస్ ఓపెన్: అక్క వీనస్‌పై సెరెనా విలియమ్స్‌దే విజయం

యూ ఎస్ ఓపెన్: అక్క వీనస్‌పై సెరెనా విలియమ్స్‌దే విజయం

అమెరికన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ జోరు ( Twitter Image)

అమెరికన్ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్ జోరు ( Twitter Image)

ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ..అమెరికన్ ‌ఓపెన్‌లో అక్కాచెల్లెళ్ల మధ్య సింగిల్స్ సమరంలో సెరెనా విలియమ్స్‌ విజేతగా నిలిచింది.యూఎస్ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో అమెరికన్ టెన్నిస్ క్వీన్స్‌ సెరెనా విలియమ్స్,వీనస్ విలియమ్స్ మధ్య జరిగిన పోరు ఏకపక్షంగా ముగిసింది. చెల్లి సెరెనా జోరు ముందు వీనస్ విలియమ్స్ విఫలమైంది.ఉమెన్స్ సింగిల్స్ థర్డ్ రౌండ్‌‌లో విలియమ్స్ సిస్టర్స్ మధ్య పోటీ తారాస్థాయిలో ఉంటుందని ఊహించారంతా.కానీ బ్లాక్ థండర్ సెరెనా విలియమ్స్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడంతో టెన్నిస్ అభిమానులకు నిరాశే ఎదురైంది.

సులువుగా ఉమెన్స్ సింగిల్స్ సెకండ్ రౌండ్ దాటి థర్డ్ రౌండ్‌లో ఎంటరైన ఈ ఇద్దరు ప్రత్యర్ధులుగా పోటీ పడ్డారు.

2018 అమెరికన్ ఓపెన్‌లో వీనస్ విలియమ్స్ 16వ సీడ్‌గా బరిలోకి దిగితే...సెరెనా 17వ సీడ్‌గా టైటిల్ రేస్‌లో ఉంది. తొలి సెట్‌ నుంచే అక్క వీనస్‌పై సెరెనా ఆధిపత్యం ప్రదర్శించింది.పవర్‌ఫుల్ సెర్వ్‌‌లు,కళ్లు చెదిరే రిటర్న్ షాట్లతో వీనస్‌పై ఒత్తిడి పెంచింది.6-1తో తొలి సెట్ నెగ్గి మ్యాచ్‌పై పట్టుబిగించింది.సెకండ్ సెట్‌లో వీనస్‌కు అసలే మాత్రం అవకాశమివ్వలేదు.తనదైన శైలిలోనే ఎటాకింగ్ షాట్లతో చెలరేగింది.ఎటువంటి అనవసర తప్పిదాలు చేయకుండా సునాయాసంగా 6-2తో సెకంట్ సెట్ నెగ్గింది.వరుస సెట్లలో వీనస్‌ను ఓడించి ప్రీ క్వార్టర్‌ఫైనల్ రౌండ్‌లో ఎంటరైంది.క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం ఈస్టోనియన్ స్టార్ కియా కనేపీతో పోటీపడనుంది.

మోడ్రన్ టెన్నిస్‌లో విలియమ్స్ సిస్టర్స్ మధ్య వైరం‌ ఈ నాటిది కాదు. గత 20 ఏళ్లుగా వీనస్,సెరెనా ఇంటర్నేషనల్ టెన్నిస్‌లో ప్రత్యర్దులుగా పోటీపడుతూనే ఉన్నారు. 1998 ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌ నుంచి అక్కాచెల్లెళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.ప్రస్తుత యూ ఎస్ ఓపెన్‌ మ్యాచ్‌తో కలిపి ఈ ఇద్దరూ 30 సార్లు ప్రత్యర్ధులుగా పోటీ పడ్డారు.15 సార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో పోటీపడ్డారు.ఫేస్ టు ఫేస్ రికార్డ్‌లో అక్క వీనస్‌పై సెరెనాదే పై చేయిగా ఉంది. సెరెనా 18 మ్యాచ్‌లు నెగ్గితే...వీనస్ 12 మ్యాచ్‌ల్లో విజేతగా నిలిచింది. ఇక అమెరికన్ ఓపెన్‌లో ఇద్దరూ 6 సార్లు ప్రత్యర్దులుగా తలపడ్డారు.4 మ్యాచ్‌ల్లో సెరెనా 2 మ్యాచ్‌ల్లో వీనస్ నెగ్గారు.

ఇవి కూడా చదవండి:

VIDEO: ఫెదరర్ షాట్‌కు ఫిదా అయిన హాలీవుడ్ హీరో

యూఎస్ ఓపెన్: సెకండ్ రౌండ్‌తోనే ముగిసిన ముగురుజా పోటీ

First published:

Tags: Serena Williams, Tennis, US Open 2018

ఉత్తమ కథలు