HOME »NEWS »SPORTS »serena williams introduces her practice partner video goes viral krs

Serena Williams: సెరెనా విలియమ్స్ క్యూట్​ పార్ట్​నర్​ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Serena Williams: సెరెనా విలియమ్స్ క్యూట్​ పార్ట్​నర్​ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Instagram Photo

మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న అమెరికా నల్లకలువ, స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్​ తన ప్రాక్టీస్ పార్ట్​నర్​ను పరిచయం చేసింది.  

  • Share this:
    అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మళ్లీ కోర్టులో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. మహిళల సింగిల్స్​లో మార్గరెట్ కోర్ట్​ అత్యధిక గ్రాండ్​స్లామ్ టైటిళ్ల (24) రికార్డును సమం చేయాలనే పట్టుదలతో సెరెనా ఉంది.  ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం కసరత్తులు చేస్తోంది. అయితే తన ప్రాక్టీస్ పార్ట్​నర్​ను  విలియమ్స్​ పరిచయం చేసింది. ఆమె తన మూడేండ్ల కూతురు అలెక్సిక్ ఒలింపియన్ జూనియర్​. కూతురితో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న క్యూట్ వీడియోను సెరెనా విలియమ్స్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. చిట్టిచేతులతో రాకెట్ పట్టిన అలెక్సిస్​​ కూడా బంతిని చక్కగా ఆపింది. సోషల్ జనాల మనసులు గెలుచుకుంది.


    కూతురితో కలిసి సెరెనా ప్రాక్టీస్ వీడియో చేసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీడియో వైరల్ అవడంతో పాటు కామెంట్లు, లైక్​ల వర్షం కురుస్తోంది. సెరెనా కోసం కూతురు రావడం చాలా బాగా అనిపిస్తోంది అని స్పందిస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ కోసం సెరెనాకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. మళ్లీ ఆమె ఆటను చూసేందుకు వేచిచూస్తున్నామని కామెంట్లు మోతెక్కిస్తున్నారు.

    ఏడాది తొలి గ్రాండ్​స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫిబ్రవరి 8 నుంచి 22వ తేదీ వరకు జరుగనుంది. ప్రతీ సంవత్సరం జనవరిలోనే జరిగే ఈ టోర్నీ కరోనా వైరస్ కారణంగా ఈసారి ఓ నెల ఆలస్యమైంది. కరోనా కేసులు నమోదవుతుండడంతో ఇంకా టోర్నీపై ఆందోళన ఉంది. ఇప్పటికీ పదుల సంఖ్యలో ప్లేయర్లు కఠిన క్వారంటైన్​లో ఉన్నారు.
    Published by:Krishna P
    First published:January 24, 2021, 08:58 IST