బ్లాక్ క్యాట్ సూట్ పై సెరెనా క్లారిటీ

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:17 PM IST
బ్లాక్ క్యాట్ సూట్ పై సెరెనా క్లారిటీ
  • News18
  • Last Updated: June 6, 2018, 3:17 PM IST
  • Share this:

ప్యారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఒపెన్ లో మాజీ టెన్నిస్ చాంపియన్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. ఉమెన్ సింగిల్స్ తొలి రౌండ్ లో  చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ ప్లిస్కోవాపై విజయం సాధించి రెండో రౌండ్ కు వెళ్లింది.


2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సెరెనా తల్లయింది. ఆ తర్వాత  కొంత కాలం పాటు ఆమె విరామం తీసుకుంది. చాలా కాలం తర్వాత గ్రాండ్ స్లామ్ టోర్నీ  ఆడుతుండడంతో  ప్యారిస్ లో సెరెనాను చూసేందుకు అభిమానులు  భారీగా తరలివచ్చారు.  ఐతే ఆమె వేసుకున్న బ్లాక్ పాంథర్ క్యాట్ సూట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తల్లైన 8 నెలల్లోనే అలాంటి బిగుతైన డ్రెస్ వేసుకోవడం హాట్ టాపిక్ గా  మారింది.
ఐతే దానికి సెరెనానే స్వయంగా వివరణ  ఇచ్చింది. ఆరోగ్యపరమైన సమస్యల నేపథ్యంలో వైద్యుల సూచనల మేరకే క్యాట్ సూట్ ధరించినట్లు తెలిపింది. ఆమె శరీరలో రక్తపు గడ్డలున్నాయి. దాంతో గత  ఏడాది బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో ప్రాణాలతో పోరాడాల్సి వచ్చింది.


‘బ్లాక్ క్యాట్ డ్రెస్ లో పోరాట యోధురాలిగా ఫీలవుతాను. నేనెనప్పుడూ ఊహల్లో విహరిస్తాను. సూపర్ హీరో కావాలనుకుంటాను. అందు కోసమే ఇలాంటి దుస్తులు ధరించాను’ అని మొదట సరదాగా చెప్పిన సెరెనా.. ఆ తర్వాత అసలు కారణం చెప్పింది.‘ నా శరరీంలో  రక్తపు గడ్డల కారణంగా గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత  ఏడాది కాలంలో ఏం జరిగిందో ఆ దేవుడికే తెలుసు. క్యాట్ డ్రెస్ వంటి బిగుతైన దుస్తులు ధరించడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు. భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. అందుకే వేసుకున్నా’  అని సెరెనా క్లారిటీ ఇచ్చాురు.

Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 9:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading