• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • SERBIAN MODEL NATALIJA SCEKIC HAS REVEALED SHOCKING DETAILS ABOUT HOW SHE WAS OFFERED 60000 EUROS TO SEDUCE TENNIS STAR NOVAK DJOKOVIC SRD

Novak Djokovic : జకోవిచ్‌పై భారీ కుట్ర..హానీట్రాప్ ఉచ్చులోకి లాగేందుకు మోడల్‌కు భారీ ఆఫర్..

Novak Djokovic : జకోవిచ్‌పై భారీ కుట్ర..హానీట్రాప్ ఉచ్చులోకి లాగేందుకు మోడల్‌కు భారీ ఆఫర్..

Photo Credit : Instagram

Novak Djokovic : ప్రపంచ నెంబర్ వన్.. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ పై భారీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ టెన్నిస్ స్టార్ ని హానీ ట్రాప్ ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగనట్లు వెలుగులోకి వచ్చింది. అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరు జకోవిచ్ ఇమేజ్‌ను మసకబార్చేందుకు అమ్మాయిని ఎరగా వేసేందుకు ప్రయత్నించారట.

  • Share this:
    ప్రపంచ నెంబర్ వన్.. సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ పై భారీ కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ టెన్నిస్ స్టార్ ని హానీ ట్రాప్ ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నాలు జరిగనట్లు వెలుగులోకి వచ్చింది. అతని ఎదుగుదలను ఓర్వలేని కొందరు జకోవిచ్ ఇమేజ్‌ను మసకబార్చేందుకు అమ్మాయిని ఎరగా వేసేందుకు ప్రయత్నించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ అమ్మాయే వెల్లడించింది. జకోను లొంగదీసుకొని, అతనితో గడిపిన దృశ్యాలను వీడియోలో బంధించి ఇస్తే.. రూ. 52 లక్షలు ఇస్తానంటూ తనకు తెలిసిన ఓ వ్యక్తి ఆఫర్‌ చేశాడని సెర్బియాకు చెందిన మోడల్‌ నటాలియా సెకిచ్‌ తెలిపింది. అయితే, జకోవిచ్‌కున్న ఇమేజ్‌ను దెబ్బతీయడం తనకిష్టం లేదనీ.. అందుకే అతని ఆఫర్‌ను తిరస్కరించానని ఓ మ్యాగజైన్‌కిచ్చిన ఇంటర్వ్యూలో నటాలియా చెప్పుకొచ్చింది. అయితే, ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయ్. క్రీడా ప్రపంచం ఆమె వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది.

    మరోవైపు సెర్బియన్ స్టార్ ప్లేయర్ .. వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆ విజయాలతో పాటే అతని పేరు, ప్రఖ్యాతులు కూడా పెరుగుతున్నాయి. ఇటీవలే జొకోవిచ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టెన్నీస్ వరల్డ్ చాంపియన్‌గా వరుసగా 311 వారాలు పాటు కొనసాగి స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదదర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. స్విస్ టెన్నిస్ స్టార్ కంటే ఒక వారం ఎక్కువగా చాంపియన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాడు.

    ఇక ఫిబ్రవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషల సింగిల్స్ టైటిల్‌ను జొకోవిచ్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో రష్యా ప్లేయర్ మెద్వెదేవ్‌పై అలవోక విజయం సాధించిన జకో.. రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చాంపియన్‌గా నిలిచాడు. దీంతో ఓవరాల్‌గా తన ఖాతాలో 18వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను వేసుకున్నాడు. మరో రెండు టైటిళ్లు తన ఖాతాలో వేసుకుంటే ఫెడరర్, నాదల్ సరసన చేరుతాడు జకోవిచ్.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు