SELECTION COMMITTEE HAS PICKED THE SQUAD FOR THE THREE MATCH ODI SERIES AGAINST THE WEST INDIES AND SHIKHAR DHAWAN LEAD THE SIDE SRD
IND vs WI : విండీస్ తో మూడు వన్డేల సిరీస్.. మరోసారి కెప్టెన్ మార్పు.. ఈ సారి ఎవరంటే..
Team India (PC : BCCI)
IND vs WI : టీమిండియాకు మరో కొత్త కెప్టెన్ వచ్చాడు. జులై 22 నుంచి విండీస్ గడ్డపై జరగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ పర్యటనకు 16 మందితో కూడిన జట్టును ప్రకటించారు బీసీసీఐ సెలెక్టర్లు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్మెంట్ తర్వాత టీమిండియా (Team India) కెప్టెన్సీ ఓ మ్యూజికల్ ఛైర్స్ ఆటలా తయారైంది. ఏడాది కాలంలో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన వారి సంఖ్య 8 మంది. అయితే వీరిలో కొత్త కెప్టెన్లు ఐదుగురు. వీరిలో ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ ఆడిన హార్ధిక్ పాండ్యా(Hardik Pandya) మినహా మిగిలిన నలుగురు కెప్టెన్లకు కెప్టెన్సీ ఏ మాత్రం కలిసి రాలేదు. అయినా, బీసీసీఐ మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా మరో కెప్టెన్ ను మార్చింది. జులై 22 నుంచి విండీస్ గడ్డపై జరగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించింది.
ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, పంత్ లకు విశ్రాంతి కల్పించింది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ను కెప్టెన్ గా నియమించింది. రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్ గా నియమించింది.
రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ లకు తిరిగి వన్డే జట్టులో చోటు కల్పించింది. మిడిలార్డర్ లో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యార్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లను ఎంపిక చేసింది.
వికెట్ కీపర్ల ఖాతాలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికయ్యారు. అక్షర్ పటేల్, చాహల్ స్పిన్నర్లుగా ఎంపికయ్యారు. పేస్ బౌలర్లుగా సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
2021 జూన్‌లో భారత ప్రధాన జట్టు ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన సమయంలో శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించాడు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్. ధావన్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది. అయితే కరోనా కేసుల సంఖ్యల భారత జట్టులోని 8 మంది కీ ప్లేయర్లు దూరం కావడంతో ఆఖరి రెండు టీ20 మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌తో ఆడింది ధావన్ టీమ్. దీంతో 2-1 తేడాతో టీ20 సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. శ్రీలంకపై టీ20 సిరీస్ ఓడిపోయిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు శిఖర్ ధావన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.