ఒకప్పుడు క్రికెట్ (Cricket) ఆడితే పేరు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం క్రికెట్ ఆడితే పేరుతో పాటు రూ. కోట్లలో డబ్బు బ్యాంక్ అకౌంట్లలో చేరుతున్నది. టీ20 లీగ్స్ ప్రారంభమైన తర్వాత ఎన్ని లీగ్స్ ఆడితే అంత డబ్బు. అయితే ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మాత్రమే ఉన్న కాలంలో ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేవి. విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఇతరుల అలవాట్లు, వ్యక్తిత్వం దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడంటే మ్యాచ్ అవగానే ఐఫోన్ పట్టుకొని పాటలు వింటూ సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. కానీ గత తరం క్రికెటర్లు మ్యాచ్ ముగిసిన తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు. అలా తాను క్రికెట్ ఆడిన సమయంతో తెలుసుకున్న విషయాలను మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అవి వింటే మనకు కూడా ఆశ్చర్యంతో పాటు నవ్వు కూడా వస్తుంది. ఆ దేశానికి చెందిన క్రికెటర్లు అలాంటోళ్లా.. ఈ క్రికెటర్ అంత తాగుబోతా అని మనమే ముక్కు మీద వేలేసుకునేలా చేస్తుంది.
శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ సమయంలో గానీ, మ్యాచ్ ముగిసిన తర్వాత కానీ ఎక్కువగా మాట్లాడరంటా. వాళ్ల పని వాళ్లు చూసుకొని వెళ్లిపోతారని సెహ్వాగ్ చెప్పాడు. అందుకు కారణం ఏంటంటే.. జట్టులో సగానికి పైగా క్రికెటర్లకు ఇంగ్లీష్ రాదు. ఇక వాళ్లేం మాట్లాడతారు అని సెహ్వాగ్ అన్నాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు క్రికెటర్లంత అపరిశుభ్రంగా ఎవరూ ఉండరంటా. రోజుల తరబడి వాళ్లు స్నానమే చేయరని సెహ్వాగ్ వెల్లడించాడు. ఇండియా వస్తే తప్ప వాళ్లు దేశంలో వాళ్ల స్నానం చేయరని.. అక్కడ చలి వాతావరణం వల్లే వాళ్లకు అలవాటై ఉండొచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు పాకిస్తాన్ క్రికెటర్లు తిట్టినన్న బూతులు ఎవరూ తిట్టరని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. మైదానంలో ఉంటే మ్యాచ్ అయిపోయే లోపు ఎన్ని బూతులు వినాల్సి వస్తుందో అని అన్నాడు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువని సెహ్వాగ్ చెప్పాడు. వాళ్లు ఒక్కోసారి అమ్మాయిల విషయంలో పోలీసులు కేసులు, జైళ్లకు వెళ్లిన సంఘటనలు కూడా జరిగాయని సెహ్వాగ్ చెప్పాడు.
ఇక పార్టీలు చేసుకోవడంలో వెస్టిండీస్ క్రికెటర్లకు ఎవరూ పోటీకి రాలేరని సెహ్వాగ్ వెల్లడించాడు. ఆ క్రికెటర్లు పగలు పడుకొని రాత్రిళ్లు మెలకువగా ఉంటారని అన్నాడు. క్రిస్ గేల్ అయితే తాగుడు మొదలు పెడితే ఆపడని.. ఒకసారి యువరాజ్ సింగ్ లాంచ్ చేసిన 'యూవీ కెన్' జెర్సీ లాంచింగ్‌కు వచ్చాడు. ఆ రోజు ర్యాంప్ వాక్ అయిపోగానే... పార్టీ ఎక్కడ పార్టీ ఎక్కడ అని గోల చేసి.. రాత్రంతా పార్టీయింగ్‌లో మునిగిపోయాడని సెహ్వాగ్ చెప్పాడు. అయితే వెస్టిండీస్ క్రికెటర్లు చాలా మంచి వారని.. పెద్దగా ఇతర విషయాలు పట్టించుకోరన సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సోనీ టీవీలో వచ్చే కపిల్ శర్మ షోలో వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాలను చెప్పుకొచ్చాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Chris gayle, Virender Sehwag