హోమ్ /వార్తలు /క్రీడలు /

Roger Federer: రోజర్ ఫెడరర్ చివరి టోర్నమెంట్.. రూ.50 లక్షలకు పెరిగిన టిక్కెట్‌ ధర..!

Roger Federer: రోజర్ ఫెడరర్ చివరి టోర్నమెంట్.. రూ.50 లక్షలకు పెరిగిన టిక్కెట్‌ ధర..!

PC : TWITTER/ATP Tour

PC : TWITTER/ATP Tour

Roger Federer: రోజర్ ఫెడరర్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇటీవల ప్రకటించాడు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెదరర్‌ 41 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఈ ఆదివారం జరగనున్న లావర్ కప్ (Laver Cup).. ఫెడరర్‌కు చివరి టోర్నమెంట్‌.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌(Roger Federer)కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. టెన్నిస్‌ (Tennis)లో అరుదైన రికార్డులను నెలకొల్పిన ఈ లెజెండరీ ప్లేయర్ చాలా మందికి ఆదర్శం. వయసు మీద పడుతున్నా ఫెడరర్‌ సాధించిన విజయాలు అందరికీ స్ఫూర్తిని ఇస్తాయి. అయితే మరికొంత కాలం ఈ ప్లేయర్ టెన్నిస్‌లో అలరిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆట నుంచి రిటైర్ (Retire) అవుతున్నట్టు రోజర్ ఇటీవల ప్రకటించి, ఫ్యాన్స్‌ను నిరాశలో ముంచెత్తాడు. తిరిగి ఫామ్ అందుకోవడానికి చాలా కష్టపడ్డానని, శరీరం సహకరించకపోవడం గమనిస్తున్నానని పేర్కొంటూ ఫెడరర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్‌ 41 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాడు. ఈ ఆదివారం జరగనున్న లేవర్ కప్ (Laver Cup).. ఫెడరర్‌కు చివరి టోర్నమెంట్‌. టోర్నీ కోసం అతడు ఇప్పటికే లండన్ చేరుకున్నాడు. అయితే రోజర్ పాపులారిటీని కొందరు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫెడరర్‌ చివరి మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను ఆదాయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అతడి చివరి టోర్నమెంట్ లావర్ కప్ కోసం సెకండరీ మార్కెట్ టికెట్ రేటు దాదాపు రూ.50 లక్షలు దాటిపోయిందని ‘ది సండే టైమ్స్’ పేర్కొంది.

ఈ పరిణామాలపై స్పందిస్తూ ఓ అభిమాని చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రజలు తమ టిక్కెట్లను తిరిగి అమ్మడం ద్వారా రోజర్ రిటైర్మెంట్‌ను డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకుంటున్నారని అతడు పేర్కొన్నాడు. అయితే ఈ ఈవెంట్‌లో ఫెడరర్ పాల్గొనడం ఇప్పటికీ అనుమానంగానే ఉంది.

* 2021 వింబుల్డన్‌కు దూరం

ఇటీవలి కాలంలో రోజర్ ఫెడరర్‌ను గాయాలు వేధించాయి. దీంతో 2021 జులైలో వింబుల్డన్‌లో బరిలోకి దిగలేదు. ఆ సమయంలో మోకాలి ఆపరేషన్లు చేయించుకున్నాడు. తన వీడ్కోలు కార్యక్రమం వచ్చే వారం లండన్‌లో జరిగే లావర్ కప్‌గా ఉంటుందని ఫెడరర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అది అతని మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహించే టీమ్ ఈవెంట్.

ఇది కూడా చదవండి : వీడిన సస్పెన్స్.. టి20 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించిన కివీస్.. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆడనున్న వెటరన్

* టెన్నిస్‌లో లెజెండరీ ప్లేయర్

స్విస్ టెన్నిస్ గ్రేట్ రోజర్ ఫెడరర్ సెప్టెంబర్ 15న అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. లావర్ కప్ తన చివరి ATP టోర్నమెంట్ అని చెప్పాడు. ‘గత మూడు సంవత్సరాలుగా గాయాలు, సర్జరీల రూపంలో నాకు సవాళ్లు ఎదురయ్యాయి. పూర్తి ఫాంలోకి తిరిగి రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ నా శరీరం సామర్థ్యాలు, పరిమితులు కూడా నాకు తెలుసు. నా వయసు 41 సంవత్సరాలు. 24 ఏళ్లలో 1500కు పైగా మ్యాచ్‌లు ఆడాను. కలలు కన్న దానికంటే టెన్నిస్ నాకు చాలా ఇచ్చింది. ఆటను ముగించే సమయం వచ్చింది’ అని ఫెడరర్‌ ఒక ప్రకటనలో తెలిపాడు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Roger Federer, Sports, Tennis

ఉత్తమ కథలు