T-20 World Cup 2021 : టీ-20 వరల్డ్ కప్ చరిత్రలోనే క్రేజీ ఫస్ట్ ఓవర్ చూశారా..? ఫ్యాన్స్ ఫిదా...!

Photo Credit : ICC

T-20 World Cup 2021 : అప్పుడప్పుడూ క్రికెట్‌లో సూపర్ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాటర్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. బౌలర్ల మ్యాజిక్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి.

 • Share this:
  టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) లో భాగంగా అబుదాబి వేదికగా స్కాట్లాండ్‌ (Scotland) తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా (Namibia) సూపర్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఉత్కంఠ పోరులో స్కాట్లాండ్‌ సెట్ చేసిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా మరో ఐదు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఓపెనర్లు క్రెయిగ్ విలియమ్స్ (23; 29 బంతుల్లో 1x6), మైఖేల్ వాన్ లింగేన్ (18; 24 బంతుల్లో 2x4) పరుగులు చేయగా.. ఆల్‌రౌండర్‌ జేజే స్మిత్ (32; 23 బంతుల్లో 2x4, 2x6), డేవిడ్ వైస్ (16; 14 బంతుల్లో 1x6) అద్భుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా స్మిత్ చివరి వరకు క్రీజులో ఉండి గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో మైఖేల్ లీస్క్ రెండు వికెట్లు పడగొట్టాడు.

  ఇక, ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రూబెల్‌ ట్రంపెల్‌మన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో స్కాట్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ట్రంపెల్‌మన్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే మున్సేను గోల్డెన్‌డక్‌గా వెనక్కిపంపాడు.ఆ తర్వాత అదే ఓవర్‌ మూడో బంతికి మెక్‌ లియెడ్‌ను డకౌట్‌గా.. నాలుగో బంతికి బెర్రింగ్టన్‌ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ఈ విధంగా ట్రంపెల్‌మన్‌ (1-0-2-3) తన తొలి ఓవర్‌ ద్వారానే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అయితే, టీ -20 ప్రపంచకప్‌ చరిత్రలో ట్రంపెల్‌మన్‌ తొలి ఓవర్‌ను క్రేజీ ఓవర్‌గా ఫ్యాన్స్‌ అభివర్ణిస్తున్నారు.

  ఇక, ఈ పోరులో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ నిర్ణీత 20 ఓవర్లలలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే స్కాట్లాండ్‌ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్‌ బ్యాటర్లు జార్జ్ మున్సే, కాలమ్‌ మెక్‌లాయిడ్‌, కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ ముగ్గురూ డకౌట్‌ అయ్యారు. రూబెన్ ట్రంపుల్‌మన్‌ వేసిన తొలి బంతికే స్కాట్లాండ్‌ ఓపెనర్‌ మున్సే (0) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.
  View this post on Instagram


  A post shared by ICC (@icc)

  మూడో బంతికి మెక్‌లాయిడ్‌ (0) వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ మరుసటి బంతికే బెర్రింగ్టన్‌ (0) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు గోల్డెన్‌ డక్‌గా వెనుతిరగడంతో స్కాట్లాండ్‌కు కోలుకోలేని దెబ్బతగిలింది. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.


  అయితే మరో ఓపెనర్‌ మాథ్యూ క్రాస్‌ (19) ఫర్వాలేదనిపించాడు. క్రెయిగ్ వాలేస్‌ (4) నిరాశపరిచాడు. ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో మైకేల్‌ లీస్క్‌ (44), క్రిస్‌ గ్రీవ్స్ (25) జోడీ స్కాట్లాండ్‌ జట్టును ఆదుకుంది. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరి వల్లే ఆ జట్టు స్కోరు 100 పరుగులు దాటిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  ఇది కూాడా చదవండి : గంగూలీ పాలిట శాపంగా ఐపీఎల్ కొత్త జట్లు.. కీలక పదవికి దాదా రాజీనామా..!

  అయితే 17వ ఓవర్లో జోరుమీదున్న లీస్క్‌ను జేజే స్మిత్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మార్క్ వాట్‌ (3) పెవిలియన్ చేరాడు. ఇక 20వ ఓవర్‌ చివరి బంతికి గ్రీవ్స్‌ రనౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయిన స్కాట్లండ్ 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో రూబెన్‌ ట్రంపెల్‌మన్‌ 3, జాన్‌ ఫ్రైలింక్‌ 2.. జేజే స్మిత్‌, డేవిడ్‌ వీజ్ చెరో వికెట్ తీశారు.
  Published by:Sridhar Reddy
  First published: