హోమ్ /వార్తలు /క్రీడలు /

మారనున్న భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగు.. ఆరెంజ్ కలర్‌లోకి.. ఎందుకంటే..

మారనున్న భారత క్రికెట్ జట్టు జెర్సీ రంగు.. ఆరెంజ్ కలర్‌లోకి.. ఎందుకంటే..

ఆరెంజ్ రంగు జెర్సీ

ఆరెంజ్ రంగు జెర్సీ

ICC CRICKET WORLD CUP | INDIA VS ENGLAND | ఈ నెల 30న జరిగే ఈ మ్యాచ్‌కు టీమిండియా ఆరెంజ్‌ జెర్సీలో అభిమానులను కనువిందు చేయనుంది.

టీమిండియా.. భారత క్రికెట్.. మెన్ ఇన్ బ్లూ.. బ్లూ జెర్సీ.. ఇదీ ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న ముద్ర. అయితే, ఈ ప్రపంచ కప్‌లో భారత జట్టు కొత్త రంగు జెర్సీలో దర్శనం ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు బ్లూ జెర్సీతో బరిలోకి దిగిన కోహ్లిసేన.. తొలిసారి ఆరెంజ్‌ జెర్సీ ధరించనుంది. అయితే ఇది కేవలం ఇంగ్లండ్‌తో జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌కు మాత్రమే. ఈ నెల 30న జరిగే ఈ మ్యాచ్‌కు టీమిండియా ఆరెంజ్‌ జెర్సీలో అభిమానులను కనువిందు చేయనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్లు బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుండగా, భారత్‌ జట్టు జెర్సీ రంగు కూడా అదే కావడంతో టీవీ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే, ఆతిథ్యం ఇవ్వనున్న దేశం.. ఇంగ్లండే కాబట్టి, ఆ దేశ జట్టు బ్లూ జెర్సీలోనే బరిలో దిగనుంది. దీంతో భారత జట్టు ఆరెంజ్ రంగును ఎంచుకుంది. ‘ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనే జట్లన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. ప్రత్యామ్నాయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్ఛ. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఈ విషయం ముందే తెలియజేయాలి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

వాస్తవానికి శనివారం జరిగే అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌కే భారత జట్టు జెర్సీ మారనుందని ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌కు అఫ్గాన్‌ జట్టే ప్రత్యామ్నాయ జెర్సీతో బరిలోకి దిగుతుండటంతో భారత్‌ బ్లూజెర్సీలోనే ఆడనుంది. పాకిస్తాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు కూడా ఆయా జట్లు జెర్సీలు మార్చుకోనున్నాయి.

First published:

Tags: Cricket, Cricket World Cup 2019, ICC, ICC Cricket World Cup 2019, Jersey, Team India

ఉత్తమ కథలు