పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు...

పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీద వేటు పడింది. టెస్ట్, టీ 20 టీమ్‌కు కెప్టెన్ గా అతడిని తొలగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

news18-telugu
Updated: October 18, 2019, 2:34 PM IST
పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు...
సర్ఫరాజ్ అహ్మద్ (FIle)
  • Share this:
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీద వేటు పడింది. టెస్ట్, టీ 20 టీమ్‌కు కెప్టెన్ గా అతడిని తొలగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లో ఘోర పరాజయంతో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. 2019-20 సీజన్‌లో జరిగే టెస్టులకు బ్యాట్స్‌మెన్ అజర్ అలీ నేతృత్వం వహిస్తాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు మరో బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ‘మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను సర్ఫరాజ్ అహ్మద్ తయారు చేశాడు. ఈ మెరికల్లాంటి ఆటగాళ్లకు నేతృత్వం వహించి రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడం మా ముందున్న లక్ష్యం.’ అని కాబోయే టెస్ట్ కెప్టెన్ అజర్ అలీ ప్రకటించాడు.

గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిపించాడు. అయితే, అతడి కెప్టెన్సీ కాలంలో టెస్టులు, వన్డేల్లో పాకిస్తాన్ ర్యాంక్ పడిపోయింది. తాజాగా సొంత గడ్డ మీద శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ వైట్ వాష్ అయిపోయింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 18, 2019, 2:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading