హోమ్ /వార్తలు /క్రీడలు /

sanju samson: పక్షివా? సూపర్ మ్యాన్‌వా?.. సంజూ వ్యాట్ ఏ క్యాచ్

sanju samson: పక్షివా? సూపర్ మ్యాన్‌వా?.. సంజూ వ్యాట్ ఏ క్యాచ్

sanju samson

sanju samson

జయదేవ్ ఉనాద్కత్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడాడు కానీ అది బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్ దిశగా వెళ్ళింది.


ముంబై వేదికగా రాజస్థాన్ రాయల్స్,ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్‌తో ఔరా అనిపించాడు. అమాంతం గాల్లో ఎగిరి స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. వికెట్ల వెనుకాల సంజూ చేసిన ఈ విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(9) బ్యాక్ సైడ్ ఆడిన ఈ బంతిని సంజూ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. అతను పట్టిన క్యాచ్‌కి బిత్తరపోయిన శిఖర్ దావన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ క్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులు అవాక్కయ్యారు. వాటే క్యాచ్ అంటూ సంజూకు కితాబిచ్చారు.

జయదేవ్ ఉనాద్కత్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడాడు కానీ అది బ్యాట్ ఎడ్జ్ తగిలి స్లిప్ దిశగా వెళ్ళింది. అనంతరం సంజూ శాంసన్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు.ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వికెట్ వెనుకలా చురుకుగా కదిలే శాంసన్ టాలెంట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పోరులో క్రిస్ మోరిస్ సూపర్ బ్యాటింగ్ తో రాజస్థాన్ విక్టరీ కొట్టింది. 148 పరగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌ఆర్‌ జట్టు 42 పరుగలకే సగం వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కష్టాల్లో పడ్డ రాజస్థాన్ కు డేవిడ్ మిల్లర్ ఆదుకున్నాడు. స్టోక్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన మిల్లర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

First published:

Tags: Rajasthan Royals, Sanju Samson, Shikhar Dhawan

ఉత్తమ కథలు