SRH vs RR: హైదరాబాద్ బౌలింగ్‌ను చితక్కొట్టిన రాజస్థాన్.. చెలరేగిన సంజూ శాంసన్.. ఎస్‌ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే

అర్దసెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (PC: IPL)

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ అర్ద సెంచరీ సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

  • Share this:
    దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్ ఎవిన్ లూయీస్ (6) నిరాశపరిచినా.. యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడారు. ముఖ్యంగా సంజూ శాంసన్ (82) ఈ సీజన్‌లో మరో అర్ద సెంచరీ సాధించాడు. హైదరాబాద్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి బౌండరీలు, సిక్సులతో అలరించాడు. లియామ్ లివింగ్‌సన్ (4) నిరాశ పరిచినా.. మహిపాల్ లామ్రోర్ (29) పర్వాలేదనిపించాడు. చివర్లో హైదరాబాద్ జట్టు వికెట్లు తీయడంతో పరుగుల వేగం తగ్గింది.







    హైదరాబాద్ బౌలర్లు సిద్దార్థ కౌల్ 2 వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులు సాధించడంతో సంజూ శాంసన్ మొత్తం పరుగుల సంఖ్య 433కు చేరుకున్నది. ప్రస్తుతం అతడే ఆరెంజ్ క్యాప్ హోల్డర్ అయ్యాడు. అలాగే మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో 3వేల పరుగుల మైలు రాయిన కూడా దాటాడు. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి కావడంతో చాలా ఆసక్తికరంగా మారింది.
    Published by:John Naveen Kora
    First published: