• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • SANJU POCKETED TOSS COIN REFEREE NOT ALLOWD IT WHAT SANJU EXPLAINED ABOUT THIS JNK

IPL 2021 : టాస్ వేసిన తర్వాత కాయిన్ జేబులో వేసుకున్న శాంసన్.. తర్వాత రిఫరీ ఏం చేశాడంటే..

టాస్ వేస్తున్న సంజూ శాంసన్ [PC : iplt20.com]

  • Share this:
    ఐపీఎల్ 14వ (IPL 2021) సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య సోమవారం వాంఖడేలో మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేసే సమయంలో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. టాస్ వేయడానికి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul), రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) రిఫరీ మనూ నాయర్‌తో కలసి పిచ్ వద్దకు చేరుకున్నారు. టీవీ హోస్ట్ మైఖెల్ స్లేటర్ ఇద్దరు క్యాప్టన్లను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రిఫరీ మనూ నాయర్ కాయిన్‌ను సంజూకి అందజేశాడు. సంజూ టాస్ వేయగా కేఎల్ రాహుల్ టెయిల్స్ కోరుకున్నాడు. అయితే టాస్ హెడ్స్ పడినట్లు రిఫరీ చెప్పి కాయిన్ (Toss Coin) తీసుకుందామనేకునే లోపే సంజూ శాంసన్ ఆ కాయిన్ తీసుకొని జేబులో వేసుకున్నాడు. జరిగిందేంటో అర్థం కాక రిఫరీ మనూ నాయర్ కాస్త పక్కకు వెళ్లాడు. అయితే ఆ కాయిన్‌ను తర్వాత రిఫరీ తీసుకున్నాడు. టాస్ కాయన్స్ క్రికెటర్లు ఇవ్వడం కుదరదని చెప్పడంతో తిరిగి ఇవ్వక తప్పలేదు. మ్యాచ్ అనంతరం ఇదే చెబుతూ 'నేను కెప్టెన్‌గా ఫస్ట్ టాస్ వేశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందులో ఆ కాయిన్ కూడా చాలా అందంగా ఉన్నది. అందుకే తీసుకొని జేబులో పెట్టుకున్నాను. కానీ రిఫరీ అలా తీసుకోవడం కుదరదు అని చెప్పారు' అని శాంసన్ వివరించాడు.

    పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 222 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మొదట్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (119) సెంచరీతో మ్యాచ్ చివరి బంతి వరకు తీసుకొని వచ్చాడు. ఒకానొక సమయంలో శాంసన్ మ్యాచ్ గెలిపించినట్లే కనిపించినా.. అర్ష్‌దీప్ సింగ్ వేసిన అద్భుత బౌలింగ్‌తో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. చివరి బంతికి భారీ సిక్స్ కొట్టాలని భావించినా.. శాంసన్ అవుటయ్యాడు. మ్యాచ్ ఓడిపోయినా.. వీరోచితంగా పోరాడిన సంజూ శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.





    మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ.. 'నేను బ్యాటింగ్ చేసే సమయంలో సెకెండ్ హాఫ్ బాగా ఆడానని అనుకుంటున్నాను. మొదట కొంచెం సమయం తీసుకొని బంతులు ఏ విధంగా వస్తున్నాయో అంచనా వేసుకున్నాను. అర్ద సెంచరీ పూర్తయ్యాక పూర్తి నియంత్రణతో షాట్లు ఆడాను. అయితే చివరిలో నాపై నాకు నమ్మకం ఉండబట్టే మోరీస్‌ను సింగిల్ తీయనీయలేదు. ఆ షాట్ కూడా చక్కగా ఆడాను కాని అవుటైపోయాను. మొత్తానికి ఒక జట్టుగా పోరాడాము. కానీ ఫలితం దక్కలేదు.' అని చెప్పుకొచ్చాడు.
    Published by:John Naveen Kora
    First published: