ఏషియాడ్:50 మీ. రైఫిల్ షూటింగ్‌లో సంజీవ్‌‌ రాజ్‌పుత్‌కు రజతం

భారత వెటరన్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో సిల్వర్ మెడల్ నెగ్గాడు.ఫైనల్ రౌండ్‌లో ఒక్క పాయింట్ తేడాతో స్వర్ణం కోల్పోయినా రజత పతకం నెగ్గి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు.

news18-telugu
Updated: August 21, 2018, 2:53 PM IST
ఏషియాడ్:50 మీ. రైఫిల్ షూటింగ్‌లో సంజీవ్‌‌ రాజ్‌పుత్‌కు రజతం
50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌‌పుత్‌కు రజతం (Twitter)
  • Share this:
18వ ఆసియా గేమ్స్‌లో భారత షూటర్లు పతకాలు మోత మోగిస్తున్నారు.షూటింగ్ నుంచి భారత్ ఖాతాలో మరో రజత పతకం చేరింది.50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో భారత వెటరన్ షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు.హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సంజీవ్ అంచనాలకు తగ్గట్టుగా రాణించాడు.క్వాలిఫైయింగ్ రౌండ్‌లో టాప్ ప్లేస్‌‌లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్ రౌండ్‌లో స్వర్ణపతకం నెగ్గే అవకాశాన్ని ఒక్క పాయింట్ తేడాతో కోల్పోయాడు. 452.7 పాయింట్లు నమోదు చేసి రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు.రజత పతకం నెగ్గి 18వ ఏషియాడ్‌లో భారత్‌‌కు షూటింగ్‌లో 3వ సిల్వర్ మెడల్ అందించాడు.




ఇదే ఈవెంట్‌లో చైనీస్ స్టార్ షూటర్ హుయ్ జుచెంగ్ 453.3 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించాడు.జపనీస్ షూటర్ మట్సుమోటో టకాయుకి 441.4 పాయింట్లతో కాంస్యం నెగ్గాడు.2018 ఏషియాడ్‌లో భారత్ సాధించిన తొలి 8 పతకాల్లో 6 మెడల్స్ షూటర్లు సాధించినవే కావడం విశేషం.
Published by: Prasanth P
First published: August 21, 2018, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading