ICC World Cup 2019 | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సానియా మీర్జా...

india vs pakistan | సోషల్ మీడియాలో అటు ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు పరస్పర విమర్శలతో వేడిక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే మ్యాచ్ సందర్భంగా రూపొందిస్తున్న యాడ్స్ పై భారత్ టెన్నిస్ తార సానియా మీర్జా స్పందించింది.

news18-telugu
Updated: June 12, 2019, 8:22 PM IST
ICC World Cup 2019 | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సానియా మీర్జా...
సానియా మీర్జా
news18-telugu
Updated: June 12, 2019, 8:22 PM IST
Sania Mirza | వరల్డ్ కప్‌లో మదర్ ఆఫ్ ఆల్ మ్యాచెస్ పేర్కొనే భారత్, పాక్ పోరు ఈ నెల 16న జరగనుంది. ఈ అతిపెద్ద క్రికెట్ సమరం కోసం ఉపఖండంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అటు భారత్ లోనూ, పాక్ లోనూ పలు మీడియా, వాణిజ్య సంస్థలు తమ క్రియేటివిటీని జోడించి, అడ్వర్టయిజ్ మెంట్స్ తయారుచేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అటు ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు పరస్పర విమర్శలతో వేడిక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ యాడ్స్ పై భారత్ టెన్నిస్ తార సానియా మీర్జా స్పందించింది. ‘‘ ఇరు దేశాల్లో మ్యాచ్ కు సంబంధించి విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్స్ చాలా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. మ్యాచ్‌ని ప్రచారం చేయడానికి ఇలాంటి చెత్త విధానం తప్ప ఇంకేమీ దొరకలేదా. ఇప్పటివరకూ వచ్చిన పబ్లిసిటీ చాలు. అది కేవలం క్రికెట్ మాత్రమే. .. దయచేసి బుద్ధి తెచ్చుకోండి’’ అంటూ ట్వీట్‌లో సానియా పేర్కొంది.

ఇదిలా ఉంటే భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు వైపులా ఉన్న మీడియా, వాణిజ్య సంస్థలు యాడ్స్ ద్వారా వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా జూన్ 16న ఫాదర్స్ డే సందర్భంగా పాకిస్థాన్, ఇండియా మ్యాచ్‌కు సంబంధించి భారత్ ను తండ్రిలా, పాకిస్థాన్ ను కొడుకులా పోల్చుతూ యాడ్ వైరల్ గా మారింది. ఇక అటు పాకిస్థాన్ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ ను పోలిన వ్యక్తితో చేసిన యాడ్ సైతం వివాదాస్పదమైంది.



First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...