అదరగొట్టిన సానియా...రీ-ఎంట్రీ తర్వాత తొలి టైటిల్ కైవసం

సుదీర్ఘ విరామం తర్వాత టెన్నీస్ కోర్ట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సానియా మిర్జా తనలో చావ తగ్గలేదని చాటుకుంది. రీ ఎంట్రీ తర్వాత తొలి అంతర్జాతీయ టైటిల్‌ని గెలుచుకుంది.

news18-telugu
Updated: January 18, 2020, 1:05 PM IST
అదరగొట్టిన సానియా...రీ-ఎంట్రీ తర్వాత తొలి టైటిల్ కైవసం
హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ గెలుచుకున్న సానియా జోడి(Photo: WTA/Twitter)
  • Share this:
తల్లి అయ్యాక టెన్నీస్ కోర్ట్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా తనలో చావ తగ్గలేదని చాటుకుంది.  తొలి అంతర్జాతీయ టైటిల్‌ని సానియా గెలుచుకుంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్ టైటిల్‌ని సానియా జోడి సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సానియా మిర్జా- నదియా కిచెనోక్(ఉక్రెయిన్) జోడి రెండో సీడ్ జాంగ్ షూ-పెంగ్ షూ(చైనా) జోడిని 6-4, 6-4 వరుస సెట్లలో మట్టికరిపించి టైటిల్ కైవసం చేసుకుంది. చైనా జోడి ఏ దశలోనూ సానియా జోడికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
శుక్రవారంనాటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సానియా జోడి 7-6, 6-2 తేడాతో మేరీ బౌచ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)-జిదాన్సెక్‌ (స్లొవేనియా)లపై గెలిచారు. చివరగా 2017లో చైనా ఓపన్‌లో 33 ఏళ్ల సానియా మిర్జా ఆడింది.
First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు