సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

Sania Mirza : బిడ్డ కోసం బరువు పెరిగిన సానియా మీర్జాపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ మెరుపు తీగలా మారిపోయింది.

news18-telugu
Updated: December 9, 2019, 8:06 AM IST
సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో
సానియా మీర్జా (credit - twitter)
  • Share this:
Sania Mirza : బిడ్డ కోసం కొంత కాలం ఆటకు దూరమైన టెన్నిస్ స్టార్ సానియా మీర్చా మళ్లీ తనేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. బిడ్డ పుట్టాక లావుగా కనిపించిన ఆమెను ఇప్పుడు చూస్తే షాకవ్వడం సహజం. ఎందుకంటే మెరుపుతీగలా మారిపోయింది. మనం చూస్తున్నది సానియా మీర్జానేనా లేక తన చెల్లెవరైనానా అని అనిపించేలా ఉందామె. కొడుకు ఇజాన్ పుట్టాక... ఆమె లావుగా కనిపించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న సానియా మీర్జా 4 నెలల్లో ఏకంగా 26 కేజీలు తగ్గింది. అదెలాగో చెబుతూ ఓ వీడియో పెట్టింది. అది కాస్తా వైరల్ అయ్యి దుమ్మురేపుతోంది. ఇంతకీ సానియా ఫిట్‌నెస్ సీక్రెట్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆమె మళ్లీ రెగ్యులర్‌గా జిమ్ చేసింది. అలాగే వర్కవుట్స్ టైమ్ పెంచింది. విమర్శల్ని సీరియస్‌గా తీసుకొని... కసితో చెమట చిందించింది. ఫలితంగా ఇప్పుడామె ఇదివరకటి సానియాలా కనిపిస్తోంది.
త్వరలో సానియా మీర్జా... మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనుంది. 2017లో ఆటకు విశ్రాంతి తీసుకున్న ఈ 33 ఏళ్ల స్టార్... 2020లో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌తోపాటు ఆస్ట్రేలియా ఓపెన్‌‌లో పాల్గొనబోతోంది. ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో ఉక్రెయిన్ ప్లేయర్ నాదియా కిచనోక్‌‌తో కలిసి కోర్టులోకి దిగబోతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ రాజీవ్‌ రామ్‌తో కలిసి బరిలోకి వెళ్లనుంది.


బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :

అత్యంత రద్దీగా శబరిమల... దర్శనానికి స్వాముల పడిగాపులు...


మరో గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో

క్యాట్‌వాక్ చేస్తూ కాలుజారిపడిన సుందరాంగి...

ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?

నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?
Published by: Krishna Kumar N
First published: December 9, 2019, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading