SANIA MIRZA INSTA REEL VIDEO ON SHOAIB MALIK GONE VIRAL CHECK VIDEO JNK
Sania Mirza Reels: సానియా మీర్జాలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏకంగా భర్త షోయబ్ మాలిక్‌నే టార్గెట్ చేసిందిగా..!
భర్త షోయబ్‌పై సెటైర్ వేసిన సానియా మీర్జా
Sania Mirza: సానియా మీర్జా తన భర్త షోయబ్‌ను టార్గెట్ చేస్తే చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందో మీరు కూడా చూడండి.
ఇండియన్ టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జాకు (Sania Mirza) స్వదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భారత మహిళా టెన్నిస్‌లో ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డులను సానియా తన ఖాతాలో వేసుకున్నది. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను (Shoiab Malik) పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కూడా సానియా తన టెన్నిస్ కెరీర్ కొనసాగిస్తున్నది. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున రెండు దశాబ్దాలకు పైగా షోయబ్ మాలిక్ క్రికెట్ ఆడుతున్నాడు. యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో కూడా పాకిస్తాన్ తరపున ఆడాడు. పాకిస్తాన్ మ్యాచ్‌లు జరిగే సమయంలో సానియా వీఐపీ గ్యాలరీల్లో కూర్చొని సందడి చేసింది. పాకిస్తాన్‌కు మద్దతుగా ఆమె స్టేడియంకు రావడాన్ని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోయారు. ఆమెపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఏకంగా పౌరసత్వం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ గొడవ అలా జరుగుతుండగానే సానియా మీర్జా పోస్టు ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఆమె తన యాక్టింగ్ టాలెంట్‌ను చూపడమే కాకుండా.. ఏకంగా భర్త షోయబ్ మాలిక్‌పై సెటైర్ వేసింది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఆ లోటును పూడ్చుకుంటున్నారు. తాజాగా సానియా ఒక రీల్ చేసింది. 'బేటా హమేషా ఉన్ లోగోంసే దూర్ రహో.. జిస్ కో తుమ్హారీ కదర్ నా హో' అనే డైలాగ్ వస్తుంది. దానికి ఫోన్ కాస్త పక్కకి తిప్పి వెనుక బెడ్‌పై పక్కన పడుకున్న షోయబ్ మాలిక్‌ను చూపిస్తూ.. ఉన్హికి ఘర్ మే రెహతీ హూ అంటూ కౌంటర్ ఇచ్చింది. అసలు దీని అర్దం ఏంటంటే... 'బిడ్డా నువ్వు ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలంటే.. కనీసం నిన్ను అభినందించని వారికి' అని డైలాగ్ ఉంటే.. సానియా 'నేను వాళ్ల ఇంట్లోనే ఉంటున్నాను' అంటూ కౌంటర్ వేసింది. ఇప్పుడు ఈ రీల్ వైరల్ అయ్యింది.
కాగా, సానియా రీల్‌ను అభిమానులు చాలా మెచ్చుకుంటున్నారు. రాబిన్ ఊతప్ప భార్య శీతల్ కూడా ఈ వీడియోను మెచ్చుకుంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్, డ్యాన్స్ మాస్టర్ ఫర్హా ఖాన్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు అంటూ ప్రశంసించింది. సానియా, షోయబ్ ఇద్దరూ తమ క్రీడా కెరీర్లతో బిజీగా ఉండటంతో చాలా కాలంగా దుబాయ్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచే తమ కెరీర్లను కొనసాగిస్తున్నారు. యూఏఈ ప్రభుత్వం ఈ దంపతులకు గోల్డెన్ వీసాను కూడా మంజూరు చేసింది.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.