SANIA MIRZA COCO VANDEWEGHE BOW OUT IN US OPEN WOMEN DOUBLES 1ST ROUND DJOKOVIC ASH BARTY ENTERS 3RD ROUND JNK
US Open: తొలి రౌండ్లోనే ఓడిన సానియా-కోకో జోడి.. యూఎస్ ఓపెన్‌లో జకోవిచ్, బార్టీ జోరు..
జకోవిచ్ జోరు.. తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా మీర్జా జోడీ (PC: US Open/Twitter)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా యూఎస్ఓపెన్ మహిళల డబుల్స్ తొలి రౌండ్లోనే ఓటమిపాలయ్యింది. మరోవైపు పురుషుల నెంబర్ 1 నోవాక్ జకోవిచ్, మహిళల నెంబర్ 1 ఆష్ బార్టీ మూడో రౌండ్లోకి ప్రవేశించారు.
ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ (Grand slam) అయిన యూఎస్ ఓపెన్‌లో (US Open) భారత టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జాకు (Sania Mirza) నిరాశే మిగిలింది. మహిళల డబుల్స్ బరిలోకి కోకో వాండేవేతో కలసి దిగిన సానియా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. వరల్డ్ నెంబర్ 12వ జోడి రలూక ఒలారు-నదియా కిచెనాక్పై సానియా జోడి 6-4, 4-6, 3-6 తేడాతో ఓడిపోయారు. ఇక మహిళల సింగిల్స్‌లో 10వ సీడ్ పెట్రా క్విటోవా 7-6(7/4), 6-2 తేడాతో క్రిస్టినా ప్లిస్కోవాపై విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. గ్రీట్ మిన్నెన్ 6-4, 6-4 తేడాతో సంసనోవాపై గెలిచి మూడో రౌండ్ చేరుకున్నది. ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్ బార్టీ (Ash Barty) 6-1, 7-5 తేడాతో అన్‌సీడెడ్ టాసన్‌పై రెండో రౌండ్లో విజయం సాధించింది. 24వ సీడ్ బడోసా కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో బెన్‌కిక్, పవ్లీచెంకోవా, ఇగా ష్వామ్‌టెక్, సోరిబెస్ టార్మో, సక్కారి, కొంటవీట్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు.
జకోవిచ్ జోరు..
పురుషుల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) జోరు కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్స్ తన ఖాతాలో వేసుకున్న నోవాక్ జకోవిచ్.. యూఎస్ ఓపెన్ కూడా గెలిచి క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఆర్దర్ ఆషే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 6-2, 6-3, 6-2 తేడాతో అన్‌సీడెడ్ ఆటగాడు గ్రీక్స్పోర్పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. తర్వాతి రౌండ్లో నిషికోరితో జకోవిచ్ తలపడనున్నాడు. ఇక మూడో రౌండ్లో 4వ సీడ్ జ్వరేవ్ అన్‌సీడెడ్ జే. సాక్‌తో పోటీపడనున్నాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో లాక్సోనెన్-గోజోవ్కి, బాసిలాషివి-ఒప్లేకా, సెప్పీ-ఓటే, కరత్సేవ్-బ్రూక్స్‌బీ, మోన్ఫిల్స్-సిన్నర్, పాప్రిన్-ఇవాన్స్, అందుజార్-డానిల్ మెద్వెదేవ్, అల్క్రాజ్ గాఫియా-సిట్సిపాస్, వాన్ డి-బాగ్నిస్ తలపడనున్నారు.
"One of the most fun cities in the world - if not the most fun city in the world."
జకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ గెలిచాడు. ఒలింపిక్స్ మెడల్ కూడా గెలవాలని బరిలోకి దిగినా నిరాశే మిగిలింది. ఇక యూఎస్ ఓపెన్ గెలిస్తే మాత్రం క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధిస్తాడు. ఇప్పటి వరకు క్యాలండర్ గ్రాండ్‌స్లామ్ పురుషుల్లో రాడ్ లావెర్ (1962, 1969)చ డాన్ బడ్జ్ (1938)లో సాధించారు. ఇక మహిళల్లో కేవలం స్టెఫీగ్రాఫ్ మాత్రమే క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ సాధించింది. ఆమె ఏకంగా క్యాలెండర్ గోల్డెన్ స్లామ్ సాధించడం విశేషం. ఇప్పుడు జకోవిచ్ కనుక యూఎస్ ఓపెన్ గెలిస్తే క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ సాధించిన మూడో పురుష టెన్నిస్ ప్లేయర్ అవుతాడు.
Published by:John Naveen Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.