Virat Kohli: 'మీరు మారిపోయారు కోహ్లీ సార్.. మీరు మారారు.. మీలో అహం తగ్గి సహనం పెరిగింది' అంటున్న పాక్ క్రికెటర్

కోహ్లీ మారిపోయాడా? అతడి బ్యాటింగ్ శైలిపై సల్మాన్ భట్ ఏమంటున్నాడు?

లీడ్స్ టెస్టులో మూడో రోజు కోహ్లీ బ్యాటింగ్ శైలిని చూసిన వాళ్లకు అతడిలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనపడుతున్నది. అదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెటర్ సల్మాన్ భట్ తనదైన శైలిలో విశ్లేషించాడు.

 • Share this:
  టీమ్ ఇండియా (Team India) కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ పర్యటనలో (England Tour) కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. అండర్సన్ (James Anderson) బౌలింగ్‌లో పదే పదే అవుటవుతూ విమర్శల పాలయ్యాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టులో గోల్డెన్ డక్ అయ్యాడు. ఇక లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో 42, 20 పరుగులు మాత్రమే చేశాడు. తాజాగా లీడ్స్‌లో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగులు మాత్రమే చేసి అండర్సన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో ఎక్కవ సార్లు ఆఫ్ స్టంప్ పైన పడే బంతులు.. ముఖ్యంగా 4, 5 స్టంప్‌ల పైన పడే బంతులను ఛేజ్ చేస్తూ అవుటైపోతున్నాడు. కోహ్లీ బలహీనతను గుర్తించిన ఇంగ్లాండ్ బౌలర్లు... ముఖ్యంగా అండర్సన్ పదే పదే ఆఫ్ స్టంప్‌పైన బంతులు విసురుతూ అతడి వికెట్ తీస్తున్నాడు. కోహ్లీ తన బలహీనతను సరి చేసుకోవాలని మాజీ దిగ్గజ ప్లేయర్ సునిల్ గవాస్కర్ (Sunil Gavaskar) కూడా సలహా ఇచ్చాడు. అవసరమైతే సచిన్ టెండుల్కర్‌తో మాట్లాడి టెక్నిక్‌ లోపాన్ని సరి దిద్దుకోమని అన్నాడు. 2003-04 సీజన్‌లో సచిన్ కూడా ఇదే రకమైన ఇబ్బందితో బాధపడ్డాడని కాని రెండు టెస్టుల అనంతరం తన లోపాన్ని సరి చేసుకొని డబుల్ సెంచరీ కొట్టాడని గవాస్కర్ గుర్తు చేశాడు.

  మరి తొలి ఇన్నింగ్స్ తర్వాత ఏం జరిగింతో తెలిచదు కానీ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఆట తీరులో మార్పు వచ్చింది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ఒక యూట్యూబ్ ఛానల్‌తో చెప్పాడు. 'కోహ్లీ పూర్తిగా మారిపోయాడు. అతడి ఆట తీరులో స్పష్టమైన మార్పు కనపడింది. గతంలో 15 నుంచి 20 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ తన వికెట్ పారేసుకునే వాడు. కోహ్లీ ఫామ్‌లో లేడని తాను చెప్పను. కానీ అతడు ప్రతీ బంతిని గట్టిగా కొడుతున్నాడు. ప్రతీ బంతికి షాట్ ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. ఎక్కువగా బంతులు వదిలి వేయడం లేదు. బౌలర్ వేసిన ప్రతీ బంతి ఆడాలని ప్రయత్నిస్తే వికెట్ కోల్పోవడం ఖాయం. కానీ శుక్రవారం కోహ్లీ అలా చేయలేదు. అతడు చాలా బంతులను వదిలేశాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ పైన పడే బంతులను విడిచిపెట్టాడు. ఇది అతనిలో వచ్చిన మార్పు. ఇది కచ్చితంగా అతడి బ్యాటింగ్ శైలిని ప్రభావితం చేస్తుంది. కోహ్లీ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. కాకపోతే ప్రతీ బంతి ఆడాలనే బలహీనత ఉన్నది. నాలుగో రోజు కోహ్లీ - పుజార కలసి భారత జట్టును మరింత మెరుగైన స్థితులో ఉంచుతారని భావిస్తున్నాను. తొలి సెషన్ తప్పకుండా కీలకంగా మారుతుంది' అని భట్ చెప్పాడు.

  నాలుగో రోజు కోహ్లీ సెంచరీ చేసి ఇన్నాళ్ల తన లోటుపు పూడ్చుకుంటాడా అని భట్‌ను ప్రశ్నించగా.. కోహ్లీ ఇప్పుడు సెంచరీ చేయడం కన్నా.. క్రీజులో ఎక్కువ సమయం ఉండటం ఇండియాకు మేలు చేస్తుంది. ఒకవైపు పుజార ఎలాగో పరుగులు రాబడుతున్నాడు. కాబట్టి కోహ్లీ నాలుగో రోజు కనీసం 2 నుంచి రెండున్నర గంగల పాటు క్రీజులో ఉండాలి. అలా గనుక జరిగితే 150 స్కోర్ వరకు చేయగలడు. సెంచరీ మీద కంటే క్రీజులో ఉండటానికి కోహ్లీ ప్రాధాన్యత ఇవ్వాలని సల్మాన్ భట్ సూచించాడు. మూడో రోజు చివరి సెషన్‌లో ఎలాగైతే పుజార-కోహ్లీ నిలబడ్డారో.. నాలుగో రోజు కొత్త బంతితో అలాగే ఉండాలి అని భట్ చెప్పాడు. భారత జట్టు కనుక 150 నుంచి 170 వరకు ఆధిక్యత సంపాదిస్తే ఇంగ్లాండ్ జట్టు కచ్చితంగా ఒత్తిడికి గురవుతుందని భట్ అన్నాడు.

  Chris Cairns: మరింత విషమంగా క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం.. హార్ట్ సర్జరీ చేస్తుంటేనే సడెన్‌ స్ట్రోక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..  Published by:John Naveen Kora
  First published: