Saina Movie Teaser: సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్ విడుదల.. సైనా పాత్రలో ఇరగదీసిన పరిణితీ చోప్రా

సైనా బయోపిక్ టీజర్ విడుదల (Twitter/Photo)

Saina Movie Teaser: ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఈ కోవలో ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితంపై సైనా బయోపిక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌తో పాటు విడుదల తేదిని ప్రకటించారు.

  • Share this:
    Saina Movie Teaser: ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే పొలిటికల్ లీడర్స్, సినిమా నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ , ఆధ్యాత్మిక వేత్తలు అనే  తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ఈ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అదే కోవలో భారత దేశానికి బాట్మింటన్‌లో తొలి ఒలింపక్ పతకం తీసుకొచ్చిన ప్రముఖ బాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథపై ‘సైనా’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా యాక్ట్ చేసింది. ఈ పాత్ర కోసం పరిణితీ బాట్మింటన్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు దాదాపు 10 కేజీ బరువు కూడా తగ్గింది. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను  అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

    ఈ సినిమాలో సైనా పాత్రకు తొలుత శ్రద్ధా కపూర్‌కు  తీసుకున్న, ఆ తరువాత ఇతర కారణాలవల్ల శ్రద్ధా ఈ ప్రాజెక్టునుండి వైదొలిగింది. ఈ పాత్ర కోసం శ్రద్ధ, సైనా దగ్గర బ్యాడ్మింటన్‌లో కోచింగ్ కూడా తీసుకుని కష్టపడింది. ఈ సినిమా కి ఆమె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు కానీ ఆమె అర్ధాంతరంగా వైదొలగడం తో సైనా పాత్రలో యాక్ట్ చేసే ఛాన్స్ పరిణీతి ని వరించింది. అయితే పరిణితికి కోసం భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ దగ్గర కోచింగ్ తీసుకుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు.

    ఈ టీజర్‌లో మన దేశంలో దాదాపు 125 కోట్ల జనాభా ఉంది. అందులో సగం మంది ఆడవాళ్లు వున్నారు. మన దేశంలో ఆడ పిల్లలకు 18 ఏళ్లు నిండగానే.. పెళ్లి చేసి అత్తారింటికీ పంపేస్తారు. కానీ కొద్ది మంది మాత్రమే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అలాంటి వారిలో బాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒకరు. ఈమె ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తొలి బాట్మింటన్ క్రీడాకారిణి. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐదు పతకాలు.. అంతేకాదు అర్జున అవార్డుతో పాటు రాజీవ్ ఖేల్ రత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఈమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి.


    ఈమె బాట్మింటన్‌లో మన దేశం తరుపున నెంబర్ వన్ నిలిచిన బాట్మింటన్ స్టార్. ఏమైనా చిన్న వయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సైనా నెహ్వాల్ ... వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: