బ్రాంజ్ మెడలిస్ట్ సైనా‌ నెహ్వాల్‌కు 'గోల్డెన్' గిఫ్ట్

ఓ వైపు ఏషియాడ్ మెడల్ నెగ్గిన సంబరం.. మరోవైపు తండ్రి బహుకరించిన ఉంగరం..దీంతో భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ఆనందానికి అడ్డే లేదు

news18-telugu
Updated: August 30, 2018, 12:21 PM IST
బ్రాంజ్ మెడలిస్ట్ సైనా‌ నెహ్వాల్‌కు 'గోల్డెన్' గిఫ్ట్
తండ్రి హర్వీర్ సింగ్‌తో సైనా నెహ్వాల్ (Saina Nehwal/Twitter)
news18-telugu
Updated: August 30, 2018, 12:21 PM IST
ప్రతిష్టాత్మక 18వ ఏషియాడ్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ప్రస్తుతం గాల్లో తేలిపోతోంది. ఆసియా గేమ్స్‌లో మెడల్ నెగ్గి దేశానికే గర్వ కారణంగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు ఆమె తండ్రి హర్వీర్ సింగ్ బంగారు ఉంగరాన్ని ప్రత్యేక బహుమతిగా ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన ఉంగరాన్ని సైనానెహ్వాల్ అపురూపంగా చూసుకుంటోంది. ఓ వైపు ఏషియాడ్ మెడల్ నెగ్గిన సంబరం...మరోవైపు తండ్రి బహుకరించిన ఉంగరం...దీంతో భారత బ్యాడ్మింటన్ క్వీన్ ఆనందానికి అడ్డే లేదు. తండ్రి ఇచ్చిన రింగ్ ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్‌‌ సెమీఫైనల్‌లో ఓడినా సైనాకు కాంస్య పతకం దక్కింది.తొలి రౌండ్ నుంచే సునాయాస విజయాలతో ఆధిపత్యం ప్రదర్శించిన సైనా జోరకు సెమీస్‌లో బ్రేక్ పడింది.తైవాన్ బ్యాడ్మింటన్ స్టార్ తై జు ఇంగ్ చేతితో ఓడి కాంస్య పతకానికే పరిమితమైంది.అయినా ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో మెడల్ నెగ్గిన తొలి భారత మహిళగా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. ఏషియాడ్‌లో హిస్టారిక్ ఫీట్ సాధించిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ ప్రపంచంలోని అన్ని ప్రతిష్టాత్మక గేమ్స్‌తో పాటు అన్ని ప్రధాన బ్యాడ్మింటన్ టోర్నీల్లో మెడల్స్ నెగ్గిన అతి కొద్దిమంది క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకుంది.ఒలింపిక్స్,కామన్వెల్త్ గేమ్స్,ఆసియా గేమ్స్,వరల్డ్ చాంపియన్‌షిప్స్,ఆసియా చాంపియన్‌షిప్స్ వంటి ప్రతిష్టాత్మక గేమ్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా పతకాలు సొంతం చేసుకున్న ఘనత సైనా నెహ్వాల్‌కే దక్కింది.








ఇవి కూడా చదవండి:


PICS: తండ్రి ఇచ్చిన గిఫ్ట్‌తో సంబరపడిపోతున్న సైనా నెహ్వాల్


ఏషియాడ్ : 11 రోజుల్లో భారత్ ఖాతాలో 11 పసిడి పతకాలు

First published: August 30, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...