టాప్-10లో సైనా నెహ్వాల్‌కు దక్కని చోటు!

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్‌ టాప్ టెన్‌‌లో ప్లేస్ కోల్పోయింది.

news18-telugu
Updated: August 10, 2018, 7:18 PM IST
టాప్-10లో సైనా నెహ్వాల్‌కు దక్కని చోటు!
వరల్డ్ చాంపియన్‌షిప్స్ క్వార్టర్‌ఫైనల్‌లో సైనా నెహ్వాల్ (AP Photo)
  • Share this:
భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్‌కు ప్రస్తుతం ఏదీ కలిసిరావట్లేదు. ఇటీవలి టోర్నీల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమవుతూ వస్తోంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సైనా టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో ఆరంభ మ్యాచ్ ‌నుంచి అదరగొట్టిన సైనా క్వార్టర్‌ఫైనల్‌లో మాత్రం విఫలమైంది. క్వార్టర్‌ఫైనల్‌లో స్పానిష్ టెన్నిస్ క్వీన్ కరోలినా మారిన్‌ను అధిగమించడంలో విఫలమైంది. వరుస సెట్లలో ఓడి టోర్నీ నుంచి ఒట్టి చేతులతోనే స్వదేశానికి తిరిగిగొచ్చింది.

ఈ ఫలితంతో గత కొంతకాలంగా టాప్ 10 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్న సైనా..టాప్ 10లో చోటు కోల్పోయింది.  ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం నుంచి 11వ స్థానానికి పడిపోయింది. మరో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవి సింధు 3వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్‌లో ఓడిన సింధు సిల్వర్ మెడల్ సొంతం చేసుకుని 3వ ర్యాంక్ నిలబెట్టుకుంది.


చైనీస్ తైపీ స్టార్ తై జు ఇంగ్ టాప్ ప్లేస్‌లో నిలవగా..జపనీస్ స్టార్ అకానే యమగుచి సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో మెడల్ సాధించలేకపోయిన సైనా ఆసియా గేమ్స్‌‌లో పతకం సాధించాలని పట్టుదలతో ఉంది. 2014 ఆసియా గేమ్స్‌లో మహిళల టీమ్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ నెగ్గిన సభ్యురాలిగా ఉన్న సైనా 2018 టోర్నీలో మాత్రం సింగిల్స్‌లో మెడల్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.
First published: August 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు