నేటి నుంచి కొరియా ఓపెన్: సైనా ఫామ్ అందుకుంటుందా?

వరుస టోర్నీల కారణంగా కొరియా ఓపెన్‌కు దూరమైన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 25, 2018, 11:06 AM IST
నేటి నుంచి కొరియా ఓపెన్: సైనా ఫామ్ అందుకుంటుందా?
సైనా నెహ్వాల్ ( Twitter Image)
  • Share this:
సైనా నెహ్వాల్... భారతదేశంలో మహిళా బ్యాడ్మింటన్ క్రీడకి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం. అనితర సాధ్యమైన విజయాలతో ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా సరికొత్త రికార్డులెన్నో సృష్టించింది సైనా. అయితే కొంతకాలంగా సైనా నెహ్వాల్ ఫామ్‌లేమితో బాధపడుతోంది. ఓ పక్క పీవీ సింధు సంచలన విజయాలు నమోదు చేస్తుంటే, సైనా మాత్రం తిరిగి ఫామ్‌ను అందుకోలేక సతమతపడుతోంది. చైనా ఓపెన్‌లో అయితే తొలి రౌండ్‌లో ఓడిపోయి వెనుదిరిగింది సైనా. దాంతో కొరియా ఓపెన్ 2018 టైటిల్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది ఈ స్టార్ షట్లర్.

పీవీ సింధు... వరుస టోర్నీలతో అలసిపోవడం వల్ల కొరియా ఓపెన్‌కు దూరమైంది. తెలుగు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కూడా కొరియా ఓపెన్‌కు దూరంగా ఉంటున్నాడు. కొరియా ఓపెన్‌లో ఐదో సీడ్‌గా బరిలో దిగుతున్న సైనా నెహ్వాల్... తొలి రౌండ్‌లో కొరియన్ ప్లేయర్ కిమ్ హో మిన్‌తో తలబడనుంది. సైనా నెహ్వాల్‌ ఎక్కువగా కొరియన్ ప్లేయర్స్ చేతుల్లోనే ఓటమిపాలైంది. దాంతో ప్రారంభ రౌండ్లను అధిగమించాలంటే సైనా నెహ్వాల్ చెమటోర్చాల్సిందే. అలా అసాధారణ విజయాలతో క్వార్టర్స్ చేరితే జపాన్ ప్లేయర్ మూడో సీడ్ నొజొమి ఒకుహరతో తలపడే ఛాన్స్ ఉంటుంది.

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ వైష్ణవి జక్కా వుమెన్స్ సింగిల్స్‌లో బరిలో దిగుతోంది. అయితే ప్రారంభ మ్యాచ్‌లోనే అమెరికన్ స్టార్ ప్లేయర్ ఆరో సీడ్ బీవెన్ జాంగ్‌తో తలబడుతోంది వైష్ణవి. మెన్స్ సింగిల్స్‌లో భారత ప్లేయర్ సమీర్ వర్మ, అజయ్ జయరామ్ బరిలో దిగుతున్నారు. డబుల్స్ ప్లేయర్స్ ఎవ్వరూ కొరియా ఓపెన్‌లో ఆడకపోతుండడం విశేషం.First published: September 25, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading