ఏషియాడ్ 2018: సెమీస్‌లో ఓడిన సైనా, కాంస్యంతో సరి!

వరల్డ్ నెం. 1 టైజూ చేతిలో వరుస సెట్లలో పరాజయం... మరో సెమీ ఫైనల్లో యమగూచితో తలపడనున్న పీవీ సింధు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: August 27, 2018, 4:44 PM IST
ఏషియాడ్ 2018: సెమీస్‌లో ఓడిన సైనా, కాంస్యంతో సరి!
సైనా నెహ్వాల్
  • Share this:
ఎన్నో అంచనాలతో ఏషియాడ్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్ చేరిన భారత స్టార్ షెట్లర్ సైనా నెహ్వల్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. వరల్డ్ నెం. 1 టైజూ చేతిలో పరాజయం పాలయ్యింది. 21- 17, 21- 14 వరుస సెట్లలో ఓడి, ఏషియాడ్ నుంచి నిష్కమించింది. మహిళల సింగిల్స్ బ్యాట్మింటన్ సెమీస్ ఈవెంట్లో మొదటి ఫలితం భారత్‌కు ప్రతికూలంగానే వచ్చింది. ఫైనల్లో భారత క్రీడాకారుల మధ్య స్వర్ణ పోరు చూద్దామనుకున్నవాళ్లకి నిరాశే ఎదురైంది. సైనా, ఫైనల్ చేరకుండానే వెనుదిరడంతో ఇప్పుడు పీవీ సింధుపైనే ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు.

మొదటి సెట్లో మొదటి నుంచి సైనాపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన టీజూ, రెండు సెట్లోనూ ఆధిక్యం పదర్శించి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. మొదటి సెట్‌ను 21- 17తో కోల్పోయిన సైనా నెహ్వాల్... రెండో సెట్‌ ఆరంభంలో మంచి కమ్‌బ్యాక్ చూపించినట్టే కనిపించింది. ఒకానొక దశలో టీజూ స్కోర్‌ను 12 -12తో సమం చేసిన సైనా 12-13తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే ఆ తర్వాత సైనాకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా సైనా శరీరాన్నే టార్గెట్ చేస్తూ షాట్స్ ఆడింది టీజూ. తైవాన్ స్టార్ ప్లేయర్ ధాటిని తట్టుకోలేకపోయిన సైనా 21- 14 తేడాతో మ్యాచ్ కోల్పోయింది. సెమీస్‌లో ఓడిపోవడంతో సైనా నెహ్వాల్‌కు కాంస్య పతకం లభించింది.

మరో సెమీ ఫైనల్లో పీవీ సింధు, జపాన్ క్రీడాకారిణి యమగూచితో తలపడనుంది.

ఇదీ చదవండి...


ఏషియాడ్: సైనా నెహ్వాల్‌కు ప్రధాని సహా ప్రముఖుల ప్రశంసలు!


ఏషియాడ్: ఫైనల్లోకి దూసుకెళ్లిన పీవీ సింధు!

First published: August 27, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...