హోమ్ /వార్తలు /క్రీడలు /

Saina Nehwal : ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బ్యాడ్మింటన్ కపుల్..

Saina Nehwal : ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బ్యాడ్మింటన్ కపుల్..

Saina Nehwal and Parupalli Kashyap

Saina Nehwal and Parupalli Kashyap

Saina Nehwal : తమ ఫ్యాన్స్ కు అదిరిపోయే రీతిలో న్యూ ఇయర్ విషెస్ చెప్పారు బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.

  తమ ఫ్యాన్స్ కు అదిరిపోయే రీతిలో న్యూ ఇయర్ విషెస్ చెప్పారు బ్యాడ్మింటన్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్. సైనా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు కశ్యప్. ఈ వీడియోను ఇన్ స్టా ద్వారా షేర్ చేసిన ఈ కపుల్.. తమ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ విషెష్ చెప్పారు. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఈ జంటకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ..కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సైనా నెహ్వాల్ రూటే సెపరేటు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న మొట్టమొదటి ఇండియన్ వుమెన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌యే! ఎంత ఎదిగినా... ఒదిగి ఉండే తత్వం కలిగిన సైనా నెహ్వాల్... ఇన్నాళ్లు బయట చాలా పద్ధతిగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించేది.

  అయితే కొన్నాళ్ల కిందట తన స్నేహితుడు, సహచరుడు పారుపల్లి కశ్యప్‌ను పెళ్లిచేసుకున్న సైనా నెహ్వాల్... మ్యారేజ్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసింది. క్లీవేజ్ షో, స్లీవ్ లెస్ టాప్స్‌‌లతో తనలోని అల్ట్రా గ్లామరస్ యాంగిల్ చూపిస్తూ... ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసేస్తుంది. సైనాలో ఈ కొత్త యాంగిల్ చూసిన అభిమానులు... ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు.

  View this post on Instagram


  A post shared by SAINA NEHWAL (@nehwalsaina)  View this post on Instagram


  A post shared by SAINA NEHWAL (@nehwalsaina)  లేటేస్ట్ గా ఈ జంట మాల్దీవుల్లో విహారించింది. ఈ టూర్ కు సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో సైనా నెహ్వాల్ పోస్ట్ చేస్తున్న ఫోటోలు... ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Badminton, Instagram, New Year 2021, Saina Nehwal

  ఉత్తమ కథలు