మలేషియా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. అద్భుత ఆటతీరుతో సెమీస్ చేరిన సైనా... చివరాటకు ఒక అడుగు ముందు ఓటమి పాలైంది. కరోలినా మారిన్‌తో సెమీస్‌లో తలబడిన సైనా నెహ్వాల్... 16-21 13-21 తేడాతో ఓడింది. నలభై నిమిషాలు పాటు సాగిన ఈ సమరంలో సైనా, మారిన్ ముందు ఏ దశలోనూ నిలవలేకపోయింది. సైనా నెహ్వాల్ 2017లో మలేషియా మాస్టర్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
గత ఏడాది పెళ్లి చేసుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్... ఈ ఏడాది ఆడిన తొలి టోర్నీలో మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నిలో అదరగొట్టే ప్రదర్శనతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన సైనా... క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ నోజోమి ఒకుహరకు షాక్ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్‌గా బరిలో దిగిన సైనా నెహ్వాల్... 21-18, 23-21 తేడాతో విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్స్ మధ్య 48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిందీ సమరం... తొలి సెట్లో 9-15 తేడాతో వెనుకబడిన దశ నుంచి అన్యూహ్యంగా పుంజుకుని, తొలి సెట్ కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్... రెండో సెట్లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది.
రెండో సెట్ ఆరంభంలో 14-18తో వెనకబడిన సైనా నెహ్వాల్... 23-21 తేడాతో గేమ్నూ, మ్యాచునూ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్...క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు. కొరియా ప్లేయర్ నాలుగో సీడ్ సన్ వాన్ హూతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-23, 21-16, 21-17... మూడు సెట్ల పాటు పోరాడిన తెలుగు తేజానికి విజయం దక్కలేదు. సన్ వాన్ హూ, శ్రీకాంత్ మధ్య మ్యాచ్ గంటా పన్నెండు నిమిషాల పాటు సాగడం విశేషం.
ఇవి కూడా చదవండి...
స్కూళ్లలో సినిమా పాటలు బంద్... బడిలో ఇకపై ఆ పాటలు బ్యాన్...
ఐటీ ఉద్యోగులూ బీ కేర్‌ఫుల్.. తాగి వాహనం నడిపితే తల ఎత్తుకోలేరు..
‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...Published by:Ramu Chinthakindhi
First published:January 19, 2019, 15:34 IST