పెళ్లి తర్వాత జోరు పెంచిన సైనా నెహ్వాల్... మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ...

నోజోమి ఒకుహరకు షాక్... క్వార్టర్స్‌లో 21-18, 23-21 తేడాతో విజయం సాధించిన సైనా... నెక్ట్స్ టార్గెట్ కరోలినా మారిన్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 19, 2019, 3:34 PM IST
పెళ్లి తర్వాత జోరు పెంచిన సైనా నెహ్వాల్... మలేషియా మాస్టర్స్‌లో సెమీస్‌లోకి ఎంట్రీ...
సైనా నెహ్వాల్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 19, 2019, 3:34 PM IST
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్... మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నిలో అదరగొట్టే ప్రదర్శనతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. పారుపల్లి కశ్యప్‌ను పెళ్లాడిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన సైనా... క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ నోజోమి ఒకుహరకు షాక్ ఇచ్చింది. శుక్రవారం సాయంత్రం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్‌గా బరిలో దిగిన సైనా నెహ్వాల్... 21-18, 23-21 తేడాతో విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్స్ మధ్య 48 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిందీ సమరం... తొలి సెట్‌లో 9-15 తేడాతో వెనుకబడిన దశ నుంచి అన్యూహ్యంగా పుంజుకుని, తొలి సెట్ కైవసం చేసుకున్న సైనా నెహ్వాల్... రెండో సెట్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది.

రెండో సెట్ ఆరంభంలో 14-18తో వెనకబడిన సైనా నెహ్వాల్... 23-21 తేడాతో గేమ్‌నూ, మ్యాచునూ కైవసం చేసుకుంది. సెమీస్‌లో మాజీ ఛాంపియన్, మూడు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ సెన్సేషన్ కరోలినా మారిన్‌తో తలబడబోతోంది సైనా నెహ్వాల్. ఈ ఇద్దరూ ఇప్పటికి 10 సార్లు తలబడగా... చోరో ఐదు సార్లు విజయం సాధించడం విశేషం. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్...క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఓడి, టోర్నీ నుంచి నిష్కమించాడు. కొరియా ప్లేయర్ నాలుగో సీడ్ సన్ వాన్ హూతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 21-23, 21-16, 21-17... మూడు సెట్ల పాటు పోరాడిన తెలుగు తేజానికి విజయం దక్కలేదు. సన్ వాన్ హూ, శ్రీకాంత్ మధ్య మ్యాచ్ గంటా పన్నెండు నిమిషాల పాటు సాగడం విశేషం.

ఇవి కూడా చదవండి...





స్కూళ్లలో సినిమా పాటలు బంద్... బడిలో ఇకపై ఆ పాటలు బ్యాన్...

ఐటీ ఉద్యోగులూ బీ కేర్‌ఫుల్.. తాగి వాహనం నడిపితే తల ఎత్తుకోలేరు..

‘దారిదోపిడి కుటుంబం’... చోరీలు చేస్తున్న తల్లీకొడుకు అరెస్ట్... ఎంత కాజేశారో తెలిస్తే...
First published: January 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...