హోమ్ /వార్తలు /క్రీడలు /

Arjun Tendulkar : హమ్మాయ్యా... ఎట్టేకేలకు ముంబై సీనియర్ జట్టులో సచిన్ తనయుడు

Arjun Tendulkar : హమ్మాయ్యా... ఎట్టేకేలకు ముంబై సీనియర్ జట్టులో సచిన్ తనయుడు

రూ.20 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ టెండుల్కర్‌ను కొనుక్కుంది.

రూ.20 లక్షలు పెట్టి ముంబై ఇండియన్స్ జట్టు అర్జున్ టెండుల్కర్‌ను కొనుక్కుంది.

Arjun Tendulkar : క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజంగా కోట్లాది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్..తొలిసారి ముంబై జట్టులో ప్లేస్ దక్కించుకున్నాడు.

  క్రికెట్ గాడ్, భారత క్రికెట్ దిగ్గజంగా కోట్లాది క్రీడాభిమానుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్..తొలిసారి ముంబై జట్టులో ప్లేస్ దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభంకానుండగా.. ఇటీవల 20 మందితో కూడిన జట్టుని ముంబయి టీమ్ సెలెక్టర్లు ప్రకటించారు. కానీ.. అందులో అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కలేదు. అయితే.. బీసీసీఐ తాజాగా రూల్‌ని మార్చి.. టీమ్‌‌లోకి 22 మంది ఆటగాళ్లని ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఆల్ రౌండర్ కోటాలో అర్జున్ కి ముంబై టీమ్ లో చోటు కల్పించింది ముంబై క్రికెట్ సంఘం. ముంబై తరఫున ఇప్పటి వరకు అండర్‌–14, 16, 19 టోర్నీల్లో పాల్గొన్న అర్జున్‌... తొలిసారి సీనియర్లతో కలిసి ఆడనుండటం విశేషం. ఈ టోర్నీలో 21 ఏళ్ల అర్జున్‌ రాణిస్తే అతడి ఐపీఎల్‌ ఎంట్రీ ముంబై ఇండియన్స్‌ తరఫున ఈ ఏడాదే ఉండే అవకాశం ఉంది. ముంబై జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథిగా వ్యవహరిస్తున్నాడు.

  గత నెలలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కోసం ప్రాబబుల్స్ టీమ్‌ని ముంబై ప్రకటించగా.. అందులో అర్జున్ టెండూల్కర్‌కి చోటు దక్కింది. కానీ.. జట్టు ఎంపిక తర్వాత జరిగిన నాలుగు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అర్జున్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టిన అర్జున్.. బ్యాటింగ్‌లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో.. అతడ్ని ట్రోఫీ కోసం ముంబై టీమ్ ఫస్ట్ ఎంపిక చేయలేదు. ముంబై సీనియర్ టీమ్‌కి అర్జున్ టెండూల్కర్ ఎంపికవడం ఇదే తొలిసారి. గతంలో శ్రీలంకలో పర్యటించిన భారత అండర్-19 జట్టులోకి అర్జున్ ఎంపికవడంపై విమర్శలు వచ్చాయి.

  అర్జున్ టెండూల్కర్ తో పాటు కృతిక్ హానగవాడి కూడా ముంబై జట్టులో ఎంపికయ్యాడు. గత వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ కు నెట్స్ లో బౌలింగ్ చేశాడు అర్జున్.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Arjun Tendulkar, Bcci, IPL, Mumbai, Sachin Tendulkar

  ఉత్తమ కథలు