Home /News /sports /

SACHIN TENDULKARS COVID TEST AND MASTER LITTLE PRANK TO MEDICAL STAFF GIVES LAUGH SRD

Sachin Tendulkar : నాటీ సచిన్ టెండూల్కర్... మాస్టర్ కొవిడ్ టెస్ట్ చూస్తే నవ్వులే నవ్వులు..(వీడియో)

సచిన్ టెండూల్కర్ (Photo Credit : YouTube)

సచిన్ టెండూల్కర్ (Photo Credit : YouTube)

Sachin Tendulkar : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు. సమకాలీ క్రికెట్‌లో బ్యాటింగ్‌ లెజెండ్‌గా ముద్రించుకున్న సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో బ్యాటింగ్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు.

ఇంకా చదవండి ...
    మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ గురించి చెప్పుకోవడానికి కొత్తగా ఏమి లేదు. సమకాలీ క్రికెట్‌లో బ్యాటింగ్‌ లెజెండ్‌గా ముద్రించుకున్న సచిన్‌ అంతర్జాతీయ కెరీర్‌లో బ్యాటింగ్‌లో లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 463 వన్డేల్లో 18426 పరుగులు.. 200 టెస్టుల్లో 15921 పరుగులు.. వన్డే, టెస్టులు కలిపి వంద సెంచరీలు( వన్డేల్లో 49, టెస్టుల్లో 51).. ఇంకా అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో భాగంగా సచిన్‌ ఇండియన్‌ లెజెండ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ జట్టులో సెహ్వాగ్‌, యువరాజ్‌, కైఫ్‌, ఇర్ఫన్‌ పఠాన్‌, ఓజా తదితర ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. ఇక, రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ-20 సిరీస్ సందర్భంగా ఆటగాళ్లందరికీ కొవిడ్ టెస్ట్ లు తప్పనిసరి. ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్ కు కోవిడ్ టెస్ట్ చేశారు. ఇందులో ఏముంది అనుకుంటే పొరపాటే. సచిన్ చిలిపితనంతో అక్కడ ఉన్న వారందరూ పరేషాన్ కు గురయ్యారు. ముక్కు ద్వారా సాంపిల్స్ తీసుకునే సమయంలో సచిన్ ఒక్కసారి పెద్దగా అరిచాడు. దీంతో సచిన్ కు ఏమైందని అక్కడ ఉన్న వారందరూ టెన్షన్ పడ్డారు.

    కానీ సచిన్ ఇంతలోనే నవ్వడం మొదలుపెట్టాడు. దీంతో ఆ టెస్ట్ చేసిన వారు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. ఇదంతా సచిన్ సరదాగా చేశాడు. స్వయంగా..ఈ వీడియోను సచిన్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక, బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ తన మార్క్‌ ఇన్నింగ్స్‌ ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు.

    సెహ్వాగ్‌ మాస్‌ ఇన్నింగ్స్‌ దాటికి సచిన్‌ ఇన్నింగ్స్‌ పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ.. సచిన్‌ ఇన్నింగ్స్‌లో కొన్ని క్లాసిక్‌ షాట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సచిన్‌ చేసింది 33 పరుగులే అయినా.. అతను కొట్టిన 5 బౌండరీలు ఒక్కో కళాత్మక షాట్‌గా పరిగణించవచ్చు. బ్యాటింగ్‌ టెక్నిక్‌లో అదే స్టైల్‌ మెయింటేన్‌ చేయడం సచిన్‌కు మాత్రమే సాధ్యమైంది. వయసు పెరిగినా బ్యాటింగ్‌లో పదును మాత్రం తగ్గలేదని నిరూపించాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Corona, Covid-19, Sachin Tendulkar, Sehwag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు