క్రికెట్ దేవుడు సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Sachin Tendulkar | ముంబై వాంఖేడ్ స్టేడియంలో 2011 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచాక భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకెళ్లిన అపురూప ఘటనకు గాను సచిన్ టెండుల్కర్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

news18-telugu
Updated: February 18, 2020, 9:49 AM IST
క్రికెట్ దేవుడు సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
2011 వరల్డ్ కప్‌ను గెలిచాక వాంఖేడ్ స్టేడియంలో సచిన్‌ను తమ భుజాలపై మోసుకెళ్తున్న భారత ఆటగాళ్లు
  • Share this:
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డు సచిన్ టెండుల్కర్‌ను వరించింది. ముంబై వాంఖేడ్ స్టేడియంలో 2011 క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచాక భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకెళ్లిన అపురూప ఘటనకు గాను ఈ అవార్డును గెలుచుకున్నాడు. భారత జట్టు రెండోసారి విశ్వవిజేతగా నిలిచాక... భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజనాలపై మోసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు. ఇది గత 20 ఏళ్లలో ప్రపంచ క్రీడల్లో అత్యంత అపురూప ఘటనగా ప్రతిష్టాత్మక అవార్డు లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డుకు ఎంపికయ్యింది. పలు అపురూప క్రీడా ఘటనకు సంబంధించి ఓటింగ్ జరగ్గా...అందులో సచిన్ టెండుల్కర్‌కు అత్యధిక ఓట్లు దక్కాయి.

అంతకు ముందు ఐదు ప్రపంచ కప్‌లు(1992,1996,1999, 2003, 2007) ఆడిన సచిన్‌కు వరల్డ్ కప్‌ను ముద్దాడాలన్న కల నెరవేరలేదు. 2003లో సౌరభ్ గంగూలీ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ వరకు చేరినా...ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమితో నిరాశతో వెనుదిరిగింది. 2007లో గ్రూప్ దశలోనే భారత జట్టు ఇంటిముఖం పట్టింది. 2011లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న సచిన్...అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను గెలిచి తన కలను నెరవేర్చుకున్నాడు సచిన్ టెండుల్కర్. ఆ అపురూప సందర్భంలో యావత్ భారత క్రీడాభిమానులు పులకించిపోయారు. ధోనీ సారథ్యంలోని భారత జట్టు సెమీస్‌లో పాక్‌ను, ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించి వరల్డ్ కప్ గెలుచుకుంది. తన 16వ ఏట 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ టెండుల్కర్..అన్ని ఫార్మెట్లలో 34,357 పరుగులు సాధించాడు.

బెర్లిన్‌లో జరిగిన లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్ టెండుల్కర్ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. వరల్డ్ కప్‌ను గెలుచుకున్న నాటి ఆనందాన్ని గుర్తుచేసుకున్నారు సచిన్. లారెస్ వరల్డ్ టీమ్ ఆమ్ ది ఇయర్ అవార్డుకు దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఎంపికకాగా... స్పోర్ట్స్‌మన్ ఇయర్ అవార్డుకు లియోనస్ మెస్సీ, లెవీస్ హమిల్టన్ ఎంపికయ్యారు.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు