SACHIN TENDULKAR WHO TOLD YOU TO DISMISS SACHIN TENDULKAR SHOAIB AKHTAR REVEALS FUNNY WARNING BY SOURAV GANGULY AT IPL 2008 SEASON SJN
Sachin- shoaib akhtar: సచిన్ వికెట్ తీసి బతికేద్దామనే.. వాళ్లు నిన్ను చంపేస్తారు.! షోయబ్ అక్తర్ కు గంగూలీ వార్నింగ్
షోయబ్ అక్తర్ (ఫైల్ ఫోటో)
IPL 2022: భారత్ లో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతలా అంటే క్రికెట్ ను ఓ మతంలా భావించేంత. ఇక సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను క్రికెట్ దేవుడగా మార్చేసి అతడిని విపరీతంగా ఆరాధిస్తారు. ఏ బౌలర్ అయినా సరే సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేస్తే... ఆ బౌలర్ కు శాపనార్థాలు పెట్టేందుకు కూడా సిద్ధమైపోతారు.
IPL 2022: భారత్ లో క్రికెట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంతలా అంటే క్రికెట్ ను ఓ మతంలా భావించేంత. ఇక సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ను క్రికెట్ దేవుడగా మార్చేసి అతడిని విపరీతంగా ఆరాధిస్తారు. ఏ బౌలర్ అయినా సరే సచిన్ టెండూల్కర్ ను అవుట్ చేస్తే... ఆ బౌలర్ కు శాపనార్థాలు పెట్టేందుకు కూడా సిద్ధమైపోతారు. ఇక క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ (shoaib akhtar) వైరం గురించి మనకు తెలిసిందే. షోయబ్ అక్తర్ బౌలింగ్ లో సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే ఎవరు పై చేయి సాధిస్తారో అని ప్రేక్షకులు కళ్లప్పగించి అలా చూస్తూ ఉండేవారు. కొన్ని సార్లు సచిన్ పైచేయి సాధిస్తే... మరికొన్ని సార్లు షోయబ్ అక్తర్ సాధించేవాడు. అయితే వీరిద్దరి వల్ల ప్రేక్షకులకు మాత్రం ఫుల్ వినోదం దక్కేది.
అయితే తాజాగా షోయబ్ అక్తర్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ ను చేసుకున్నాడు. ఒక స్పోర్ట్స్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ 2008లో ఎదురైన ఈ సంఘటనను వివరించాడు. ఐపీఎల్ తొలి సీజన్ 2008లో జరగ్గా... అప్పుడు షోయబ్ అక్తర్ కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)కు ఆడాడు. ఆ సీజన్ లో ముంబై వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో తాను సచిన్ ను డకౌట్ చేయడం పెద్ద తప్పు అని... ఆ తర్వాత ఫ్యాన్స్ నుంచి బెదిరింపు వ్యాఖ్యలు వినాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
’ముంబైలో మేం మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాం. వాంఖడే మొత్తం అభిమానులతో నిండిపోయింది. సచిన్ ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. సచిన్ కు నేను బౌలింగ్ చేయడానకి వచ్చాను. నా బౌలింగ్ లో సచిన్ టెండూల్కర్ అవుటయ్యాడు. అంతే... అభిమానులు నాపై మాటలతో విరుచుకుపడ్డారు. చంపేస్తాం అంటూ బెదిరించారు. అప్పుడు నేను ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాను. నా బాధను గమనించిన గంగూలీ... నా దగ్గరకు వచ్చి... సచిన్ ను అవుట్ చేయమని నీకు ఎవరు చెప్పారు. ముంబై లో సచిన్ ను అవుట్ చేసి బతికేద్దాం అని అనుకుంటున్నావా? వాళ్లు (ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ) నిన్ను చంపేస్తారు‘ అంటూ కామెంట్స్ చేశాడు. అనంతరం తన ఫీల్డింగ్ ను మార్చాడని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఇదంతా సర్దుకుందని షోయబ్ పేర్కొన్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.