SACHIN TENDULKAR TURNS BARBER FOR SON ARJUN SHARES VIDEO BS
కొడుకు జుట్టు కత్తిరించిన సచిన్ టెండుల్కర్.. షాక్‌లో అభిమానులు..
అర్జున్‌కు హెయిర్ కట్ చేస్తున్న సచిన్
తమకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అభిమానులకు భలే సరదాగా ఉంటుంది. తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
లాక్డౌన్లో సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా ప్రతీ ఒక్కరు తమ చేయికి పని చెప్తున్నారు. కొందరు వెరైటీ వంటకాలు ట్రై చేస్తుంటే.. మరికొందరు తమకు తోచిన పనులు చేస్తూ గడిపేస్తున్నారు. అయితే, తమకు ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం అభిమానులకు భలే సరదాగా ఉంటుంది. తమ అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తాము ఏం చేస్తున్నామనేది చెబుతున్నారు. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీకి అనుష్క కటింగ్ చేయగా, ఇప్పుడు సచిన్ తన కుమారుడు అర్జున్‌కు కటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
కూతురు సారా టెండూల్కర్ సూచనలతో అర్జున్‌కు కటింగ్ చేశాడు సచిన్. వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘తండ్రిగా ఉన్నపుడు పిల్లల కోసం అన్నీ చేయాల్సి ఉంటుంది. గేమ్స్ ఆడటం, జిమ్ చేయడం.. మాత్రమే కాదు కటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. హెయిర్ కటింగ్ ఎలా ఉన్నా నువ్వు ఎప్పటికీ అందంగానే ఉంటావు అర్జున్. కటింగ్‌లో సాయం చేసిన నా సెలూన్ అసిస్టెంట్ సారా టెండూల్కర్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, బ్యాట్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సచిన్.. కత్తెర పట్టడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. లాక్డౌన్లో కాస్త రిలాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.