ధోనీ ఈజ్ రైట్... మహీకి సచిన్ సపోర్ట్

Sachin supports MS Dhoni | సచిన్‌తో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ లవర్స్ అంతా ఇప్పుడు ధోనీనే టార్గెట్ చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోనీ బ్యాటింగ్ చేసిన విధానం సరైందే అని సచిన్ టెండూల్కర్ కామెంట్ చేయడం అతడి ఫ్యాన్స్‌కు ఊరట కలిగిస్తోంది.

news18-telugu
Updated: July 3, 2019, 1:16 PM IST
ధోనీ ఈజ్ రైట్... మహీకి సచిన్ సపోర్ట్
ధోనీ‌తో సచిన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో టీమిండియా మాజీ సారథి ధోనీ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. కీలకమైన సమయంలోనూ ధోనీ స్లోగా బ్యాటింగ్ చేయడం... భారీ షాట్స్ కొట్టకుండా ఆడటం చాలామందికి నచ్చలేదు. ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో ధోనీ స్టయిల్ ఆఫ్ బ్యాటింగ్ క్రికెట్ లవర్స్‌తో పాటు అతడి ఫ్యాన్స్‌ను కూడా నిరాశపరిచింది. స్లాగ్ ఓవర్స్‌లో తన బ్యాట్‌కు పని చెప్పే ధోనీ... ఈ సారి పరుగులు తీసేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనిపించడం చాలామందికి నచ్చలేదు. ఆఘ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ తీరును క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ధోనీ అంత నెమ్మదిగా ఆడటాన్ని తాను కూడా చూడలేకపోయానని సచిన్ కామెంట్ చేశాడు.

సచిన్‌తో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ లవర్స్ అంతా ఇప్పుడు ధోనీనే టార్గెట్ చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోనీ బ్యాటింగ్ చేసిన విధానం సరైందే అని సచిన్ టెండూల్కర్ కామెంట్ చేయడం అతడి ఫ్యాన్స్‌కు ఊరట కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో అందరూ ధోనీ నుంచి బిగ్ షాట్స్ ఆశించారనే విషయాన్ని అంగీకరించిన సచిన్... ధోనీ మాత్రం కుర్ర ఆటగాళ్లకు ఆ అవకాశం ఇవ్వాలని భావించాడని అభిప్రాయపడ్డాడు. జట్టు కోసం ధోనీ ఆలోచించిన తీరు సరైందే అని సచిన్ తెలిపాడు. ధోనీ తన ఆట కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని అన్నాడు. కొహ్లి సైతం మ్యాచ్ అనంతరం కొహ్లిని వెనకేసుకురావడం విశేషం.


First published: July 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>