ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్ల కంపెనీపై సచిన్ కేసు.. 2 మిలియన్ డాలర్ల దావా...

Sachin Tendulkar : సిడ్నీకి చెందిన స్పార్టాన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ... 2016లో తన పేరును ప్రచారానికి వాడుకుంటూ... 1 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పుకుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తెలిపాడు. స్పోర్ట్స్ వస్తువులు, డ్రెస్సుల అమ్మకానికి సచిన్ బై స్పార్టాన్ పేరుతో ప్రచారం చేసుకుందని వివరించాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 9:32 AM IST
ఆస్ట్రేలియా క్రికెట్ బ్యాట్ల కంపెనీపై సచిన్ కేసు.. 2 మిలియన్ డాలర్ల దావా...
సచిన్ టెండుల్కర్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 9:32 AM IST
ఆస్ట్రేలియా బ్యా్ట్స్ తయారీ కంపెనీ స్పార్టాన్ స్పోర్ట్స్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కేసు వేశాడు. ఉత్పత్తులకు తన పేరు, ఫొటోలను వాడుకున్నందుకు ఆ కంపెనీ తనకు 2 మిలియన్ డాలర్లు ( రూ.1,39,76,000) చెల్లించాలని సచిన్ తెలిపాడు. ఇందుకు సంబంధించి ఫెడరల్ కోర్టుకు సచిన్ కొన్ని ఆధారాలు ఇచ్చాడు. వాటి ప్రకారం... సిడ్నీకి చెందిన స్పార్టాన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కంపెనీ... 2016లో సచిన్ పేరును ప్రచారానికి వాడుకుంటూ... 1 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పుకుంది. స్పోర్ట్స్ వస్తువులు, డ్రెస్సుల అమ్మకానికి సచిన్ బై స్పార్టాన్ పేరుతో ప్రచారం చేసుకుంది. ఆ కంపెనీ ఉత్పత్తుల్ని ప్రచారం చేస్తూ సచిన్... కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లండన్, ముంబైలో జరిగిన ఇండియన్ ఫైనాన్షియల్ హబ్‌లో ఆ కంపెనీ తరపున ప్రచారం చేశాడు.

2018 సెప్టెంబర్‌లో తాను చెల్లించాల్సిన మనీని స్పార్టాన్ చెల్లించలేదు. అప్పట్లో తనకు డబ్బు చెల్లించాలని సచిన్ గుర్తు చేశాడు. మనీ ఇవ్వకపోవడంతో... ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఇకపై తన పేరునూ, వస్తువులనూ వాడొద్దని కంపెనీకి సూచించాడు. కానీ ఇప్పటికీ స్పార్టాన్ తన పేరును వాడుకుంటోందని కోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్లలో సచిన్ తెలిపాడు. దీనికి లెస్ గాల్ బ్రెయిత్ బాధ్యుడని సచిన్ కోర్టుకు తెలిపాడు. దీనిపై స్పార్టాన్ కంపెనీ ఇంతవరకూ స్పందించలేదు. ఈ పిటిషన్‌ను జూన్ 26న కోర్టు విచారించనుంది.

 

ఇవి కూడా చదవండి :40వేల ఏళ్ల నాటి తోడేలు తల... ఇప్పటికీ అలాగే ఉంది... సైబీరియా మంచులో...

డబ్బుల్లేని ATMపై ఫైన్... ఆర్బీఐ కొత్త నిర్ణయం

టీడీపీలో మొదలైన సెగలు... చంద్రబాబుపై తమ్ముళ్ల మాటల మంటలు...
Loading...
ఏపీలో కొత్త మద్యం పాలసీ... 10 శాతం వైన్ షాపులు ఔట్...
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...