సచిన్ వందో సెంచరీ ముందు కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా...

సచిన్‌ టెండూల్కర్‌ వందో సెంచరీ కోసం దాదాపు రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే 90ల్లో ఔటవుతూ...వందో సెంచరీ అందని ద్రాక్షగా మారిన సమయంలో... సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఓ సలహా ఇచ్చాడు.

news18-telugu
Updated: June 6, 2020, 9:29 PM IST
సచిన్ వందో సెంచరీ ముందు కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా...
సచిన్ టెండూల్కర్
  • Share this:
ట్రిపుల్‌ సెంచరీకి 5 పరుగుల దూరంలో సిక్సర్‌ బాదాలంటే గుండె బండ కావాల్సిందే. కానీ సెహ్వాగ్‌ మాత్రం 295 సిక్సర్‌ బాది వీరుడనిపించుకున్నాడు. షోయబ్ అక్తర్ అయినా, బ్రెట్ లీ అయినా ఎవరి బౌలింగ్ అయినా బంతిని సిక్స్ బాదడమే పనిగా పెట్టుకొని సెహ్వాగ్ బరిలోకి దిగేవాడు. కెరీర్‌ చివరి వరకూ అలాగే కొనసాగాడు. 99 వద్ద ఉన్న సిక్స్ కొట్టడానికి ఎంచుకునేవాడు. అంతేకాని రికార్డుల కోసం ఎదురుచూసే వాడు కాదు. అయితే సచిన్‌ టెండూల్కర్‌ వందో సెంచరీ కోసం దాదాపు రెండేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే 90ల్లో ఔటవుతూ...వందో సెంచరీ అందని ద్రాక్షగా మారిన సమయంలో... సచిన్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఓ సలహా ఇచ్చాడు. నాన్న 94 పరుగుల వద్దకు చేరుకోగానే సెహ్వాగ్‌లా సిక్సర్‌ కొట్టు దెబ్బకు సెంచరీ పూర్తవుతుంది’ఇది వీరూ విధ్వంసం అంటే. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అతికొద్దిమంది బ్యాట్స్ మెన్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడిన సెహ్వాగ్‌ మూడు ఫార్మాట్‌లలో కలిపి 17,253 పరుగులు చేశాడు.
First published: June 6, 2020, 9:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading