Rekulapally SaichandRekulapally Saichand
Updated: August 14, 2020, 5:11 PM IST
sachin-tendulkar
సచిన్ టెండూల్కర్.. లక్షలాది మందికి ఆ పేరో ఇన్స్ప్రేషన్. అతని బ్యాట్‌తో చేసిన మాయా అభిమానుల గుండెల్లో ఇప్పటికి నిలిచిపోతుంది. అతని 22 ఏళ్ల సుదీర్ఘ కిక్రెట్ ప్రయాణంలో ఎన్నో మైలురాయిలు మరెన్నో ఆటుపోట్లు వాటిని తట్టుకొని అతను చేసిన సహాసం అతన్ని క్రికెట్ దెవున్ని చేసింది. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ అడుగు పెట్టిన సచిన్‌కు తొలినాళ్ళలలోనే అమోగమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. 100 సెంచరీల సాధించి అందనంత ఎత్తుకు చేరాడు. భారత అత్యున్నత పురస్కారమైన 'భారత రత్న'ను గెలిచాడు.
అయితే క్రికెట్లో అతని విజయవంతమైన ప్రయాణానికి తొలి అడుగు పడింది ఈ రోజుతోనే... 30 ఏళ్ల కిత్రం తన తొలి సెంచరీని ఇదే రోజు సాధించాడు. 1990,ఆగస్టు 14న ఇంగ్లండ్‌తో జరిగిన నాటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి సెంచరీని సాంధించాడు. 17 ఏళ్ల వయసులోనే సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ టెస్ట్ మ్యాచ్ మెుదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 519 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు 432 పరుగుల చేసింది. అప్పటి కెప్టెన్ మమ్మద్ అజారుద్దీన్ 179 పరుగులు చేయగా సచిన్ 68 రన్స్‌తో రాణించారు. అ తర్వాతా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు 320 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 407 పరుగుల విజయలక్ష్యం నమోదైంది. ఈ సమయంలో సచిన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 189 బంతుల్లో 119 పరుగులు చేశాడు. దీంతో భారత్ 343/6 పరుగులతో మ్యాచ్‌ని డ్రాగా ముగిచింది. తన తొలి సెంచరీకి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సచిన్ దీనిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
"ఈ ఇన్నింగ్స్ నాకు ఎంతో ప్రత్యేకం. ఆ సెంచరీ గురించి తర్వాత రోజు పత్రికల్లో వచ్చిన హెడ్లైన్ నన్ను సర్ఫ్రైజ్ చేసింది. అంతకుముందు పాకిస్ధాన్‌తో కూడా ఇలాంటి ఇన్నింగ్సే ఆడాం. ఆ మ్యాచ్‌లో వకార్ యూనీస్ వేసిన బంతి వల్ల నా ముక్కుకు గాయమై రక్తం కారింది. నా తన జెర్సీ మొత్తం రక్తంతో తడిసిపోయింది. 38 పరుగులకే 4 వికెట్లు పోయి కష్టాలలో ఉన్న సమయంలో కష్టపడి 57 రన్స్ చేశా.. ఎలాగో అలాగా మేం మ్యాచ్‌ను కాపాడుకున్నాం" అన్నారు.
Published by:
Rekulapally Saichand
First published:
August 14, 2020, 5:02 PM IST